twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇలా అయితే సినిమాలో ఇంకేం చూపిస్తాం?: చిరాకు పడ్డ తెలుగు దర్శకుడు

    తమిళ సినిమా మెర్సల్ ఒక వివాదాన్ని సృష్తించినా... చాలా ప్రశ్నలను మాత్రం లేవనెత్తింది..

    |

    తమిళ సినిమా మెర్సల్ ఒక వివాదాన్ని సృష్తించినా... చాలా ప్రశ్నలను మాత్రం లేవనెత్తింది..అసలు సినిమా విశయం లో సెన్సార్ బోర్డ్ చేయాల్సిన పని ఏమిటీ? సినిమా విడుదలని ఆపే హక్కు సెన్సార్ బోర్డ్ కి ఉందాలేదా? అన్న ప్రశ్నలకి సమాధానాలు చాలామంది సినిమావాళ్ళకే తెలియవు. గత సంవత్సరం ఉడ్తా పంజాబ్ సినిమా విశయం లో కేంద్ర సెన్సార్ బోర్డ్ ఏకంగా 80 వరకూ సీన్లని కట్ చేసినప్పుడు ముంబై కోర్ట్ ఆ చర్యని ఖండించింది. సినిమా విషయం లో సర్తిఫికెట్ ఇవ్వటం వరకూ ఓకే గానీ సీన్లని తొలగించే అధికారం సెన్సార్ బోర్ద్ కి లేదని స్పష్తం చేసింది.

     సెన్సార్ వాళ్ళ తీరు మాత్రం మారనే లేదు

    సెన్సార్ వాళ్ళ తీరు మాత్రం మారనే లేదు

    అయినా ఆ విషయం లో సెన్సార్ వాళ్ళ తీరు మాత్రం మారనే లేదు. మెర్సల్ విషయం లో ముందు అన్ని సీన్లనీ ఒప్పుకొని రిలీజ్ కి అనుమతించిన సెన్సార్ బోర్దు... జీఎస్టీ మీద వ్యతిరేకంగా డైలాగులున్నాయని బీజేపీ వివాదం చేయగానే తెలుగు వెర్షన్ రిలీజ్ కి అడ్డం పడింది... ఆ వివాదాస్పద దైలాగులు తీసేస్తే తప్ప సినిమా విడుదల చేయటానికి వీలు లేదంటూ చెప్పేసింది.

    "అదిరింది" అదరకుండా అక్కడే ఆగిపోయింది

    ఫలితంగా రెండు వారాలకిందటే రావాల్సిన మెర్సల్ తెలుగు వెర్షన్ "అదిరింది" ఇంకా అదరకుండా అక్కడే ఆగిపోయింది. ఈ నేపథ్యం లోనే తెలుగు దర్శకుడు ప్రవీణ్ సత్తారు తన సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇవ్వటం చూసి కోపం తెచ్చుకున్నాడు... ఈ మధ్య సెన్సార్ బోర్డు ప్రతిదానికీ అభ్యంతరాలు చెబుతోందని.. దీంతో ఫిలిం మేకర్ల స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని ప్రవీణ్ అన్నాడు.

    ఆవేదన వ్యక్తం చేశాడు

    ఆవేదన వ్యక్తం చేశాడు

    ఈ రోజుల్లో ప్రతి ఒక్క అంశం సున్నితంగా మారిపోతోందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. "సినిమాలో ఒక మంత్రి తప్పు చేస్తున్నాడని చెప్పకూడదట. ఒక పోలీసు అధికారి కానీ.. ఒక ప్రభుత్వ అధికారి తప్పు చేస్తున్నట్టు చూపించకూడదట. ఇలా అయితే సినిమాలో ఇంకేం చూపిస్తాం?

     ప్రజలు ఈ విషయంపై ప్రశ్నించాలి

    ప్రజలు ఈ విషయంపై ప్రశ్నించాలి

    ఇప్పుడున్న సెన్సార్ బోర్డు అధికారులు అప్పట్లో ఉండుంటే ‘వందేమాతరం'.. ‘ప్రతిఘటన' లాంటి సినిమాలు తీయడం సాధ్యమయ్యేది కాదేమో. ప్రజలు ఈ విషయంపై ప్రశ్నించాలి. ఇలాంటి పరిస్థితే కొనసాగితే సమాజంలో చైతన్యం కలిగించే సినిమాలు ఎలా వస్తాయి?

    "క్లీన్ యు" వస్తుందనుకున్నాం

    మా సినిమాకి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. దాంతో షాకయ్యాను. హింస.. రక్తపాతాల్లాంటివేవీ లేకుండా సినిమా తీశాం కాబట్టి ‘క్లీన్ యు' వస్తుందనుకున్నాం. ఇప్పటితో పోలిస్తే 70లు.. 80ల్లోనే స్వేచ్ఛ ఎక్కువగా ఉండేదనిపిస్తోంది. ఒక ట్వీట్ చేయాలంటే పదిసార్లు ఆలోచించాల్సి వస్తోందిప్పుడు. మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ వాక్ స్వాతంత్య్రం ఉండాలి'' అని ప్రవీణ్ అన్నాడు.

    English summary
    Tollywood director Praveen Sattharu who is releasing His New Movie PSV Garuda vega with Rajashekhar is Fire on censor Bord for U/A cirtificat for his movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X