రామ్ వదిలేశాడు.. ధనుష్ చేతుల్లోకి వెళ్ళింది!
గరుడ వేగ చిత్రంతో అందరిని ఆశ్చర్యపరిచిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు కొత్త సినిమా తెరక్కించేందుకు రెడీ అవుతున్నాడు. మరొక డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ప్రవీణ్ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గరుడ వేగ చిత్రం విజయం సాధించిన వెంటనే హీరో నితిన్ తో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ తరువాత రామ్ తో ప్రాజెక్ట్ ఓకే అయింది.
బడ్జెట్ కారణాల రీత్యా రామ్ కూడా ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనితో ప్రవీణ్ సత్తారుకు హీరో కష్టాలు మొదలయ్యాయి. ఇదే కథని తమిళ హీరో ధనుష్ కు వినిపించాడట. ప్రస్తుతం ధనుష్ అంగీకారం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

ధనుష్ కు తెలుగు, తమిళ భాషల్లో మార్కెట్ ఉంది కనుక బడ్జెట్ సమస్యలు రావని ప్రవీణ్ భావిస్తున్నాడు. విభిన్న చిత్రాలలో నటించేందుకు హీరో ధనుష్ ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాడు.


Click it and Unblock the Notifications











