twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎల్‌.బి.డబ్ల్యూ దర్శకుడి ‘రొటీన్‌ లవ్‌స్టోరీ’

    By Bojja Kumar
    |

    గత కొన్ని రోజుల క్రితం విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సినిమా ఎల్.బి.డబ్ల్యు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రవీణ్ సత్తారు ఈ సారి రోటీన్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రోటీన్ లవ్ స్టోరీ అంటే కొంపతీసి ఇంకేదో అనుకునేరు. సినిమా పేరే 'రొటీన్ లవ్ స్టోరీ". స్నేహగీతం సినిమాలో నటించిన సందీప్ ఇందులో హీరోగా నటిస్తుండగా, ఎస్‌ఎమ్‌ఎస్‌ ఫేం రెజీన కథానాయికగా చేస్తోంది. చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.... ''రొమాంటిక్‌ కామెడీ ఇది. టైటిల్‌లోని రొటీన్‌కి చాలా వ్యంగ్యార్థముంది. హాస్యప్రధానంగా సినిమాని మలుస్తాం. 24నుంచి రెగ్యులర్‌ చిత్రణకు వెళుతున్నాం. 20రోజులు హైదరాబాద్‌లో చిత్రీకరించి, డిసెంబర్‌ తొలివారంలో లడక్‌ వెళతాం. తదుపరి శ్రీలంక షెడ్యూల్‌ ఉంటుంది. జనవరిలో తొలికాపీ వస్తుంది. ఫిబ్రవరి 2వ వారంలో సినిమా విడుదల చేస్తాం"" అన్నారు.

    ఈ చిత్రాన్ని ఎ వర్కింగ్‌ డ్రీమ్‌ ప్రొడక్షన్స్‌-బెంచ్‌మార్క్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చాణక్య బూనేటి, పి.మణికుమార్‌ నిర్మాతలు. అర్చన బూనేటి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత. హైదరాబాద్‌ అన్నపూర్ణ సూడియోలో సినిమా ప్రారంభమైంది. ముహూర్త సన్నివేశానికి బెల్లంకొండ సురేష్‌ క్లాప్‌నివ్వగా, దిల్‌రాజు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. కె.అచ్చిరెడ్డి గౌరవదర్శకత్వం వహించారు. చోటా కె.నాయుడు కెమెరా మానిటరింగ్‌ చేశారు. లక్ష్మీప్రసన్న, రెజీన, మణికుమార్‌, చాణక్య, సురేష్‌, ధర్మేంద్ర తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎడిటింగ్‌: ధర్మేంద్ర, పాటలు: కృష్ణ చిన్ని మాదినేని, కళ: ఉపేంద్ర, కథ-కథనం-మాటలు-దర్శకత్వం: ప్రవీణ్‌.

    English summary
    LBW director Praveen next film 'Routine Love Story'. Sandeep and Rejina lead of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X