నాగచైతన్య సరసన ప్రీతికారావు కన్ఫర్మ్
రామ్ గోపాల్ వర్మ బెజవాడ రౌడీలు చిత్రంలో నాగచైతన్య సరసన మొదట జెనీలియా అనుకున్నారు.కానీ ఇప్పుడా ప్లేస్ లోకి బాలీవుడ్ హీరోయిన్ అమృతారావు సోదరి ప్రీతిక రావు వచ్చి చేరింది. ప్రీతికారావు ప్రస్తుతం వరుణ్ సందేశ్ సరసన ఓ చిత్రం లో చేస్తోంది. ఇక వర్మ, కిరణ్ కుమార్ కోనేరు నిర్మిస్తున్న బెజవాడ రౌడీలు చిత్రం షూటింగ్ ప్రస్తుతం విజయవాడలో జరుగుతోంది. నాగచైతన్యపై 'శరభ శరభ...' అనే గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య మాట్లాడుతూ ''వర్మ శిష్యుడు వివేక్ ఈ చిత్రాన్ని చక్కగా మలుస్తున్నారు. నా పాత్ర యువతరానికి నచ్చుతుంద''న్నారు. దీపావళికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ప్రభు, ముకుల్‌దేవ్, అభిమన్యు సింగ్, అజయ్, కోట శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్, రూపాకౌర్, అశోక్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: వందిత కోనేరు, పాటలు: సిరాశ్రీ, రెహమాన్, సంగీతం: అమర్ మోహ్లీ.


Click it and Unblock the Notifications











