twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కడుపుతో ఉన్నప్పటికీ...ఐశ్వర్యరాయ్ కాసులవేట!

    By Bojja Kumar
    |

    దీపం ఉన్నప్పడే ఇల్లు చక్కదిద్దు కోవాలనే సామెను...సినీరంగంలో ఉన్న హీరోలు, ముఖ్యంగా హీరోయిన్లు చాలా బాగా ఉపయోగించుకుంటుంటారు. వచ్చిన ఏ అవకాశాన్ని వదులు కోకుండా డబ్బు సంపాదిస్తుంటారు. విశ్వసుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు.

    ప్రస్తుతం ఐశ్వర్య ఆరు నెలల గర్భవతి. అయినా సరే తన ఫ్రొఫెషన్‌ను వదులుకోకుండా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తోంది. రీసెంట్‌గా బ్యాంకాక్ వెళ్లిన ఐష్ లక్స్ సబ్సుల కంపెనీకి సంబంధించిన కొత్త యాడ్‌లో నటించింది. కొన్ని రోజులుగా షూటింగులకు దూరం కావడంతో కాస్త ఒళ్లు చేసి నవనవలాడుతూ కొరుక్కు తినాలనిపించేలా చాలా అందంగా కనిపించిందట. ఐష్ ఇంత అందంగా గతంలో ఎన్నడూ చూడలేదని ఆశ్చర్య పోయారట యాడ్ ఫిల్మ్ చిత్ర యూనిట్.

    ఇదంతా బాగానే ఉంది కానీ...కడుపుతో ఉన్నప్పుడు కూడా ఇలాంటి చేయడం ఎందుకంటూ కొందరు విమర్శిస్తున్నారు. అమ్మ తనం అనేది చాలా గొప్పది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరు నెలల గర్భం ఉన్నప్పడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఒప్పుకోవడం ఎందుకు? మరీ ఇంత కాసుల కక్కుర్తి ఎందుకు? అంటూ చిటపటలాడుతున్నారు.

    English summary
    Aishwarya Rai is in her sixth month of pregnancy and she is enjoying her pre motherhood phase.But but that isn't stopping the Bachchan bahu from her professional commitments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X