»   » లైంగికంగా వేదించిన బాయ్ ఫ్రెండ్ తోనే మళ్ళీ కనిపించింది: పెళ్ళయ్యాక కూడా

లైంగికంగా వేదించిన బాయ్ ఫ్రెండ్ తోనే మళ్ళీ కనిపించింది: పెళ్ళయ్యాక కూడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

నెస్ వాడియా, ప్రీతి జింతా మధ్య ఉన్న సంబంధం అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఇద్దరూ కలిసి గతంలో ఐపీఎల్ పంజాబ్ టీంకు ఓనర్లుగా ఉన్నారు. కొంత కాలం తర్వాత విడిపోయారు. అదీ మామూలుగా కాదు ఇద్దరి మధ్యా పెద్ద యుద్దమే జరిగింది. తనను వాడియా గదిలో బందించి కాలే సిగరెట్లను ముఖంపై వేసే వాడని , తనపై చేయి చేసుకొని హింసాత్మకంగా ప్రవర్తించే వాడని, వాడియా నుంచి తనను దూరంగా కోరుకుంటున్నానని, లేదంటే ఏదో ఒకరోజు వాడియా ఆగ్రహానికి తాను బలికావలసి వస్తుందని ఆరోపించింది ప్రీతీజింతా...

లైంగికంగా వేదించాడని

లైంగికంగా వేదించాడని

వాంఖడే స్టేడియంలో పంజాబ్-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తనతో నెస్ వాడియా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా తనపై చేయి చేసుకున్నాడని, లైంగికంగా కూడా వేదించాడని ప్రీతి జింతా ఆరోపించింది. ఐపీఎల్ ఫ్రాంఛైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు ప్రీతి సహ భాగస్వామి.

ప్రేమ వ్యవహారం

ప్రేమ వ్యవహారం

నెస్ వాడియా, ప్రీతి జింతాల మధ్య గతంలో నాలుగేళ్ల పాటు ప్రేమ వ్యవహారం నడిచింది. 2009లో వీరిద్దరూ విడిపోయారు. బాలీవుడ్ లోనే కాదు, ఐపీఎల్ విషయం కూడా కాబ్ట్తి ఈ ప్రేమ "యుద్దం" దేశం మొత్తం హాట్ టాపిక్ అయ్యింది. నెస్ వాడియ కూడా తన తరపు వాదనలు వినిపించాడు మొత్తానికి ఆ కేసు ఏమయ్యిందో గానీ మళ్ళీ ఎక్కడా ఈ ఇద్దరి పేర్లూ కలిసి కనిపించలేదు.

 జీని గుడెనఫ్ ని పెళ్ళి చేసుకొని

జీని గుడెనఫ్ ని పెళ్ళి చేసుకొని

ఆతర్వాత కొంత కాలానికి తన ఫ్రెండ్ అయిన జీని గుడెనఫ్ ని పెళ్ళి చేసుకొని అమెరికా లోనే స్థిరపడింది ప్రీతీ. అయితే ఇప్పుడు సడెన్ గా అమ్మడి ఫ్లాష్ బ్యాక్ ఎందుకు పైకి వచ్చిందీ అంటే.... ఐపీఎల్ కొత్త సీజన్ ఆరంభమైనప్పటి నుంచి ప్రీతి.. వాడియా సన్నిహితంగా కినిపిస్తున్నారు.

 ఆశ్చర్యం కలిగించే విషయమే

ఆశ్చర్యం కలిగించే విషయమే

పంజాబ్ మ్యాచ్ సందర్భంగా స్టాండ్స్ లో ఇద్దరూ ముచ్చటించుకుంటూ కనిపించడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించిన అనంతరం ఇద్దరూ తమ జట్టు ఆటగాళ్లతో కలసి సంబరాలు కూడా చేసుకున్నారు. తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన వ్యక్తితో మళ్లీ ఇలా ప్రీతి సన్నిహితంగా కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. హై ప్రొఫైల్ జీవితాల్లో ఏం జరిగినా అది సంచలనమే మరి...

English summary
Preity Zinta and Ness Wadia's conversation post Kings XI Punjab's win proves that everything is alright between the two.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu