మహేష్ హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్
దాదాపుగా కెరీర్ ముగిసిందనుకుంటున్న సమయంలో వరుసగా రెండు చిత్రాలతో మళ్లీ బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా. 2009లో 'మై అవుర్ మిస్ ఖన్నా' చిత్రం తరువాత మూడేళ్లపాటు బాలీవుడ్‌కు దూరంగా ఉన్న ఈ భామ 2012లో 'హర్పల్' అనే చిత్రంలో నటించినా అది విజయం సాధించలేదు.
దీంతో పూర్తిగా బాలీవుడ్‌కు దూరమైందనుకుంటున్న సమయంలో ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో 'ఇష్క్ ఇన్ పారిస్' చిత్రంతో మళ్లీ మన ముందుకు రాబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు యజమాని అయిన ప్రీతి జింటా ఇప్పుడు జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌లను పక్కన పెట్టి తన సినిమా ప్రచారంలో పాల్గొంటోంది.
మే 24న విడుదల కానున్న 'ఇష్క్ ఇన్ పారిస్' చిత్రానికి సంబంధించి ఒక కార్యక్రమంలో ప్రీతితోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. సన్నీ డియోల్ హీరోగా నీరజ్ పాఠక్ దర్శకత్వంలో 'భయ్యాజీ సూపర్‌హిట్' చిత్రంలోనూ నటిస్తున్నట్లు తెలిపింది. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే విడుదల అవుతోంది.


Click it and Unblock the Notifications












