ప్రీతీ జింతా లైంగిక వేధింపుల కేసు: ఇద్దరి సాక్ష్యం

By Srikanya

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటి ప్రీతీజింతా తన మాజీ సహచరుడు నెస్‌వాడియాపై చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ముంబయి పోలీసులు ఇద్దరు వ్యక్తుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. ప్రీతీజింతా విదేశాల్లో ఉండడంతో ఆమెను మాత్రం చేరుకోలేకపోయారు. మే 30న వాంఖడే స్టేడియంలో నెస్‌వాడియా అందరి సమక్షంలో తనను తీవ్రంగా అవమానపరుస్తూ దుర్భాషలాడారంటూ ఆమె ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే.

ఆ రోజు ఆ స్టేడియంలో ఘటన జరిగినట్లు చెబుతున్న గార్వారే పెవిలియన్‌ వద్ద ఉన్న ఇద్దరు వ్యక్తుల నుంచి వివరాలు సేకరించి నమోదు చేసుకున్నామని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఆ ఇద్దరు ఎవరు? వారు ఏం చెప్పారనేది వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ప్రీతీ జింతా, నెస్‌వాడియా మధ్య నడిచిన ఇ-మెయిల్‌లనూ పోలీసులను పరిశీలించబోతున్నారు. ఇద్దరి మధ్యా సంబంధాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో తెలుసుకునేందుకు అవి కొంత వరకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు

Preity Zinta molestation case: cops identify two witnesses

మాజీ ప్రియుడు, వ్యాపారవేత్త అయిన నెస్‌వాదియా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని బాలీవుడ్‌ నటి ప్రీతిజింటా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీఎల్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు వాదియాతో పాటు ప్రీతి జింటా సహ యజమానిగా ఉన్నారు. వాదియా తనను వాంఖడే స్టేడియంలో లైంగికంగా వేధించారని, బెదిరింపులకు పాల్పడ్డారని ముంబయి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.

ఎవ్వరికీ హాని చెయ్యడానికి కాదని, కేవలం తన ఆత్మరక్షణ కోసమే పోలీసులను ఆశ్రయించానన్నారు. ఈ విషయాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని ప్రీతిజింటా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వాదియాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు కమిషనర్‌ రాకేష్‌ మారియా తెలిపారు. వాంఖడే స్టేడియంలోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించనున్నట్లు పోలీసులు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X