19 ఏళ్ల మహేష్ 'రాజకుమారుడు'.. ప్రీతి జింతా బాగానే గుర్తుపెట్టుకుంది!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తొలి చిత్రం రాజకుమారుడు. ఈ చిత్రం విడుదలై నేటికి 19 ఏళ్ళు పూర్తయింది. అప్పటికే పలు చిత్రాల్లో మహేష్ బాల్య నటుడిగా అదరగొట్టాడు. మంచి పేరున్న నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మహేష్ ని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసే బాధ్యతని కె రాఘవేంద్ర రావు తీసుకున్నారు.
రాజకుమారుడు చిత్రం మంచి విజయం సాధించింది. మహేష్, బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింతా ఈ చిత్రంలో జంటగా నటించారు. రాజకుమారుడు చిత్రాన్ని ప్రీతి జింతా బాగానే గుర్తుపెట్టుకుంది. మహేష్, సూపర్ స్టార్ కృష్ణ, రాఘవేంద్ర రావు, అశ్విని దత్ తో దిగిన అరుదైన ఫోటోని పోస్ట్ చేస్తూ ట్వీట్ చేసింది.

రాజకుమారుడు చిత్రం విడుదలై 19 ఏళ్ళు పూర్తి కావడంతో ఈ చిత్ర విశేషాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. 1999 జులై 30 న ఈ చిత్రం విడుదలైంది. తక్కువ సమయంలోనే మహేష్ తిరులేని స్టార్ గా మారిపోయాడు.


Click it and Unblock the Notifications











