ప్రీతిజింటాకు రూ.35 కోట్ల నష్టం
మహేష్ తో రాజకుమారుడు,వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా చిత్రాల్లో చేసిన సొట్టబుగ్గల బాలవుడ్ సుందరి మరో సారి వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె స్వతంగా నడుపుతున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు భారీ నష్టాల్లో ఉన్నట్లు ప్రకటించి అందరినీ మాట్లాడుకునేలా చేసింది. ఐపీఎల్‌లో నాలుగు సీజన్లు ఆడినా.. ప్రీతిజింటాకు చెందిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు ఇంకా నష్టాల్లోనే ఉందట. 2010-11 ఆర్థిక సంవత్సరానికి ఆ జట్టు రూ.35.26 కోట్ల నష్టాన్ని చూపింది. దీంతో మొత్తం నష్టం రూ. 68.08 కోట్లకు చేరుకుంది. 2008 ఐపీఎల్‌లో ఈ జట్టు ఎక్కువ నష్టం చవిచూసింది.
ఆమె ప్రస్తుతం ఎయిడ్స్ ఎవేర్ నెస్ పై ప్రచారం ప్రారంభించటానికి సిద్దంగా ఉంది. మన దేశంలో ఎయిడ్స్ అనేది చాలా ప్రమాదకరమైన స్ధితిలో ఉంది. దీన్ని నివారించాల్సిన అవసరం ఉంది అంటోంది ప్రీతీ జింతా. చేతిలో సినిమాలు లేని ఆమె తెలుగులో అప్పుడప్పుడూ అడపాదడపా డబ్బింగ్ లతో పలకరిస్తోంది. మరో ప్రక్క ఇలా నష్టాలతో క్రీడలతో ముందుకు వెళుతోంది.


Click it and Unblock the Notifications











