రేప్ చేయడం తీవ్రవాదమే: స్టార్ హీరోయిన్ ధ్వజం
ముంబై : దేశంలో రోజు రోజుకు పెరిగి పోతున్న లైంగిక దాడుల సంఘటనలపై బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింతా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని దేశీయ తీవ్రవాదులుగా పరిగణించాలని ఆమె వ్యాఖ్యానించారు. అదే విధంగా ఇలాంటి సంఘటనలు జరిగినపుడు భారతీయలు ప్రవర్తిస్తున్న తీరును కూడా తప్పుబట్టారు.
ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ...'ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భారతీయులం వెంటనే రియాక్ట్ అవుతాం. అంతా ఒక చోట చేరతాం, ఆందోళన చేస్తాం. తర్వాత అంతా మరిచి పోయి ఇంటికెళ్లి పడుకుంటాం. కానీ అలాంటి సంఘటనలు మాత్రం మళ్లీ జరుగకుండా ఆపలేక పోతున్నాం. రేప్ చేయడం కూడా దేశయ తీవ్ర వాదం లాంటిదే' అని వ్యాఖ్యానించారు.
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాన్నో, పోలీసులనో నిలదీసి ఊరుకుంటే సరిపోదు. ఇలాంటి దారుణాలు జరుగకుండా చూసేలా ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి. అప్పుడే మహిళలపై జరుగుతున్న దాడులను ఆపగలం అని ప్రీతి జింతా చెబుతోంది. మహిళలు అప్రమత్తంగా ఉండటంతో పాటు, చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించింది. ఇటీవల ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడిని ప్రీతి జింతా ఖండించింది. ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.


Click it and Unblock the Notifications












