థియేటర్ నుండి అతన్ని బయటకు గెంటేసిన ప్రీతి జింతా

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ నటి ప్రీతి జింతా థియేటర్ నుండి ఒక యువకుడిని బయటకు గెంటేయడం చర్చనీయాంశం అయింది. ‘బ్యాంగ్ బ్యాంగ్' సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సినిమా ప్రారంభానికి ముందు థియేటర్లో జాతీయ గీతం వేసారు. అయితే జాతీయ గీతం వస్తున్నపుడు ఓ యువకుడు లేచి నిలబడటానికి నిరాకరించడంతో కోపం వచ్చిన ప్రీతి జింతా అతన్ని బలవంతంగా బయటకు గెంటేసింది.

ఈ విషయాన్ని ప్రీతి జింతా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అయితే ప్రీతి జింతా చర్యపై ప్రశంసలతో పాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ గీతాన్ని గౌరవించని వారికి ఇలాంటి జరుగాల్సిందే...ప్రీతి జింతా చేసింది కరెక్టే అని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఆమె చర్యను తప్పుబడుతున్నారు.

Preity Zinta throws boy out of theatre

ఇలా చేయడం ద్వారా దేశ భక్తి ఉన్న ప్రతి వారు తనలానే ప్రవర్తించాలని చెప్పకనే చెప్పింది ప్రీతి జింతా. దీంతో పాటు నరేంద్ర మోడీ చేపట్టి ‘స్వచ్ భారత్' కార్యక్రమానికి కూడా ప్రీతి జింతా తన మద్దతు ప్రకటించింది. గతంలో షారుక్ ఖాన్ తో కలిసి తాను ముంబై వీధుల్లో చేసిన క్లీన్ డ్రైవ్ కార్యక్రమం గురించి ప్రీతి జింతా గుర్తు చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X