మగధీర, ఆర్య2 కి ధీటుగా ‘బృందావనం’లో జూ ఎన్టీఆర్ బీభత్సమైన స్టెప్పులతో ఇరగదీసాడు..!?
బృందావనం కోసం నటి కాజల్ అగర్వాల్ తో జూనియర్ ఎన్టీఆర్ ఆడి పాడుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఎన్టీఆర్ జూనియర్, కాజల్ అగర్వాల్ పై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ...కొద్దిగా ప్యాచ్ వర్క్ ఉంది. స్విట్జర్లాండ్, టర్కీలలో ఒక్కో పాటను తీయాల్సి ఉంది. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. తమన్ చక్కటి ట్యూన్స్ ఇచ్చాడు. సెప్టెంబరు 12న ఆడియోను విడుదల చేసి అక్టోబర్ 1న సినిమా విడుదల చేస్తామన్నారు.
ఇక డాన్స్ విషయంలో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, హీరో జూ ఎన్టీఆర్ ని 'బృందావనం" పాటల్లో చాలా కష్టబెట్టేశాడట. అదేంటీ, జూ ఎన్టీఆర్ మంచి డాన్సర్ కదా..ఎన్టీఆర్ ని కొరియోగ్రాఫర్ కష్టబెట్టడమేంటని అనుకుంటున్నారా..నిజమే..'యమదొంగ"సినిమా కోసం మోకాలి చిప్పలు వాచిపోయేలా బీభత్సమైన స్టెప్పుల్ని జూ ఎన్టీఆర్ కోసం వేయించిన ప్రేమ్ రక్షిత్, ఆ సినిమాతో కొరియోగ్రాఫర్ గా మంచి మార్కులే కొట్టేశాడు.
టాలీవుడ్ లో ది బెస్ట్ డాన్సర్స్ లో ఎన్టీఆర్ రేంజ్ ని మరింత పెంచింది 'యమదొంగ" సినిమాలోని 'నాచోరో నాచోరే..."సాంగ్. మళ్ళీ ఇప్పుడు ఆ రేంజ్ లో..కాదు కాదు..అంతకన్నా ఎక్కువగానే, 'బృందావనం"లో జూ ఎన్టీఆర్ తో బీభత్సమైన స్టెప్పులు వేయించేశాడట ప్రేమ్ రక్షిత్. 'మగధీర"తో చరణ్, 'ఆర్య2" తో అల్లు అర్జున్ ఇచ్చిన పోటీని తట్టుకోవాలంటే జూ ఎన్టీఆర్ ఆ మాత్రం కష్టపడక తప్పదు మరి..
చూద్దాం..'బృందావనం" సినిమాలో జూ ఎన్టీఆర్ డాన్సుల్లో ఏ రేంజ్ లో ఇరగదీసేశాడో స్ర్కీన్ పైన చూడాల్సిందే....


Click it and Unblock the Notifications











