Don't Miss!
- Technology వాట్సాప్‌లో Recently Online ఫీచర్.. ఎమర్జెన్సీ సమయంలో ఎలా పనిచేస్తుంది..?
- News ఏపీలో మొత్తం మారిపోయిన సీన్..గెలుపు ఆ పార్టీదే తేల్చిసిన సర్వే
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Lifestyle చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటిస్తే..విజయం వద్దన్నా వస్తుంది..
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
- Sports ఆర్సీబీలో ఆడే ఇండియన్ ప్లేయర్లకు ఇంగ్లీషే రాదు: సెహ్వాగ్ సెన్సేషన్
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే.. ఖరీదైన జాగ్వార్ F టైప్ స్పోర్ట్స్ కారులో బామ్మ చక్కర్లు
ఆకాష్ పూరి చేతుల మీదుగా ‘ప్రేమ దేశం’ మూవీ లాంచ్
మెహబూబా సినిమాతో హీరోగా మారిన ఆకాష్ పూరి.... తొలి సినిమాతోనే సెలబ్రిటీ హోదా సొంతం చేసుకున్నాడు. తాజాగా ఆకాష్ పూరి చేతుల మీదుగా ప్రేమ దేశం అనే కొత్త సినిమా లాంచ్ అయింది. అజయ్ కతుర్వా, మాయ, శివకుమార్ రామచంద్రవరప, వ్యాసకి, తనికెళ్ళభరణి, వెన్నెలకిశోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వం వహిస్తున్నారు.
సిరి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై శిరీషా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పంజా ఫేం నీలిమా తిరుమలశెట్టి సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆకాష్ పూరి తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఆనంద్ రంగ గౌరవ దర్శకత్వం వహించారు.
ఆకాష్ మాట్లాడుతూ - అజయ్ నాకు మంచి మిత్రుడు. ఇద్దరం కలిసి సినిమాలు చేశాం. తనకు ఈ సినిమా హీరోగా మంచి పేరు తేవాలి. మణిశర్మగారి సంగీతం అంటే సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు అన్నారు. హీరో అజయ్ మాట్లాడుతూ - పూరిగారు నటుడిగా నాకు బ్రేక్ ఇచ్చారు. డిఫరెంట్ లవ్‌స్టోరీ. కొత్త కాన్సెప్ట్‌తో సాగుతుంది అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ - నీలిమ తిరుమల శెట్టిగారు కథ విని తన వంతు సపోర్ట్ అందించడానికి సిద్ధమయ్యారు. అలాగే మణిశర్మగారు సంగీతం అందించడానికి ఓకే చెప్పారు. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది అన్నారు.
అజయ్ కతుర్వా, మాయ, శివకుమార్ రామచంద్రవరప, వ్యాసకి, తనికెళ్ళభరణి, వెన్నెలకిశోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: కిరణ్ తుంపర, కెమెరా: శేఖర్ గగనమోని, మ్యూజిక్: మణిశర్మ, నిర్మాత: శిరీషా(నీలిమ తిరుమల శెట్టి సహకారంతో), దర్శకత్వం: శ్రీకాంత్ సిద్ధం.