సినిమా షూటింగ్ అడ్డుకున్న ఆంధ్రా వర్శిటీ విద్యార్థులు

తాజాగా ఈచిత్రం షూటింగ్ విశాఖలోని ఆంధ్ర యూనివర్శిటీ లైబ్రరీలో జరుగుతుండగా విద్యార్థులు అడ్డుకున్నారు. యూనివర్శిటీ లైబ్రరీలో షూటింగులు జరుపడం వల్ల ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఇక్కడ షూటింగ్ నిర్వహించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. దీంతో షూటింగ్ నిలిపివేయక తప్పలేదు.
దాడి బాలభాస్కర్, మద్దాల భాస్కర్ లు నిర్మిస్తున్న ఈచిత్రం ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ 'ఇదొక విభిన్న ప్రేమకథా చిత్రం. ఆద్యంతం నవ్వులు కురిపించే ఈ చిత్రంలో అంతర్లీనంగా యువతకు అవసరమయ్యే చక్కటి సందేశం ఉంటుంది. పూర్తి వాణిజ్య విలువల మేళవింపుతో రూపుదిద్దుకోబోయే ఈచిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు ఉంటాయి' అన్నారు.
సుబ్బు చెప్పిన ఈ కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నా పరిచయ చిత్రానికి తగ్గుట్టుగా ఉన్న ఈ కథ ద్వారా నన్ను మంచి నటుడిగా నిరూపించుకోగలనన్న విశ్వాసం పూర్తిగా ఏర్పడింది. ఇదొక అద్భుతమైన చిత్రంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్. కుమార్.


Click it and Unblock the Notifications











