twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ప్రేమ ఇష్క కాదల్’...మూవీ రివ్యూ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హర్షవర్థన్ రానే, వితికశేరు, విష్ణువర్థన్, రీతువర్మ, హరీష్, శ్రీముఖి నటీనటులుగా బెక్కం వేణుగోపాల్ (మేం వయసుకు వచ్చాం) నిర్మించిన చిత్రం 'ప్రేమ ఇష్క్ కాదల్'. డి.సురేష్‌బాబు సమర్పణలో షిర్డి సాయి కంబైన్స్, లక్కీ మీడియా సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకుడు. యూత్ ఫుల్ స్టోరీతో, కొత్తగా తీసామని దర్శక నిర్మాతలు ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. మరి సినిమా విశేషాలేమిటో చూద్దాం...

    కథ విషయానికొస్తే....మూడు జంట చుట్టూ కథ తిరుగుతుంది. కానీ మూడు జంటలు ప్రేమ వ్యవహారాలు డిఫరెంటుగా ఉంటాయి. మొదటి జంట విషయానికొస్తే...రాండి(హర్ష వర్ధన్), సరయు (వితిక శేరు). ఆండి ఒక అనాధ. ఓ కాఫీషాప్ రన్ చేస్తూ ఉంటాడు. అతనొక మంచి మ్యూజిషియన్ కూడా. అయితే డబ్బుల కోసం షోలు చేయడం కాకుండా తన కాఫీ షాపులోనే తన టాలెంటు ప్రదర్శిస్తుంటాడు. అతనితో ఎలాగైనా తన కాలేజీలో షో చేయించేందుకు సరయు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఇద్రి మధ్య ప్రేమ పుడుతుంది.

    Prema Ishq Kadhal-Movie Review

    రెండో జంట విషయానికొస్తే...అర్జున్(హరీష్), శాంతి(శ్రీముఖి). అర్జున్ ఒక రేడియో జాకీ. అతనిది అమ్మాయిల పిచ్చి ఉన్న ప్లేబాయ్ క్యారెక్టర్. కానీ శాంతిని చూడగానే ప్రేమలో పడతాడు. మూడో జంట రాజు(విష్ణు వర్ధన్), సమీర(రీతు వర్మ). పల్లెటూరి నుంచి వచ్చిన రాజు ఇక్కడ సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరుతాడు. తనతో పాటు సినిమాకు పని చేసే కాస్టూమ్ డిజైనర్‌ను పెళ్లాడతాడు. ఈ మూడు ప్రేమ కథలు చివరకు ఏమయ్యాయి అనేది మిగతా కథ.

    హర్షవర్థన్ రానే, వితికశేరు, విష్ణువర్థన్, రీతువర్మ, హరీష్, శ్రీముఖి పెర్ఫార్మెన్స్ పరంగా ఓకే. కొత్త దర్శకుడయిన పవన్ సాధినేని కథకు అనుగుణంగా నటీనటుల నుంచి తాను కోరుకున్న నటన రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అయితే సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించే స్క్రీన్ ప్లే విషయంలో ఫెయిల్ అయ్యాడు. టెక్నిల్ అంశాలై మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ తదితర ఓకే అనే విధంగా ఉన్నాయి.

    కథ విషయానికొస్తే....ప్రస్తుతం ఉన్న యువత పూర్తి పాశ్చాత్య ధోరణితో ఆలోచిస్తున్నారనే అంశాన్ని సినిమాలో చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు తాను అనుకున్న విషయాన్ని పర్ ఫెక్టుగా చెప్పడంలో విఫలం అయ్యాడు. సెకండాఫ్ లో వేగం కాస్త తగ్గిపోవడమే కాకుండా మూడు లవ్ ట్రాక్స్ లో వచ్చే సీన్స్ ఏమిమీ జరుగుతుందా అనేది ఆడియన్స్ ఊహించేలా ఉంటుంది. కానీ క్లైమాక్స్ మాత్రం ఊహించని విధంగా ఉంటుంది. ఎంటర్టెన్మెంట్ కూడా ఉండాల్సిన స్థాయిలో లేదు. అయితే దర్శకుడిది మొదటి ప్రయత్నం అయినా అనుభవం ఉన్న వాడిలా తీసాడు. ఇదొక్క అంశం మాత్రం మెచ్చుకోవచ్చు. ముఖ్యంగా సినిమా కేవలం యూత్‌కు మాత్రమే కాస్త కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్, ఇతర వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకోవడం కష్టమే.

    English summary
    Having multiple protagonists with their own story is popular trend in Hollywood. Of late it is getting extended to Tollywood. With a few movies made it to the list, Prema Ishq Kadhal is the latest film to enter the league. This film has three different stories connected at some point. Debutant director Pavan Sadineni tried his best to entertain with lively narration, which will impress young film goers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X