Don't Miss!
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రేమకథ చిత్రం సినిమా కు సీక్వెల్... సుమంత్ అశ్విన్ హీరో!
ప్రేమకథ చిత్రం, నటుడు సునీల్ జక్కన్న వంటి బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ తో ఆర్ పి ఏ క్రియేషన్స్ మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు ప్రేమ కథా చిత్రం కు సీక్వెల్ ప్లాన్ చేసింది. ఆర్ పి ఏ క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 3 గా ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా "ప్రేమ కథా చిత్రం 2" సినిమా సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. 'బ్యాక్ టూ ఫియర్' అనేది క్యాప్షన్. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఈరోజు ప్రారంభం అయ్యింది.
హీరో సుదీర్ బాబు ప్రేమకథ చిత్రం, నటుడు సునీల్ జక్కన్న వంటి బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ తో ఆర్ పి ఏ క్రియేషన్స్ మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు ప్రేమ కథా చిత్రం కు సీక్వెల్ ప్లాన్ చేసింది. ఆర్ పి ఏ క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 3 గా ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా "ప్రేమ కథా చిత్రం 2" సినిమా సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. 'బ్యాక్ టూ ఫియర్' అనేది క్యాప్షన్. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ సాగర్ క్లాప్ కొట్టారు. అమరేందర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. అఖిల్ రెడ్డి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. హరి కిషన్ ఈ చిత్రం తో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.
ఆర్ పి ఏ క్రెయేషన్స్ బ్యానర్లో వచ్చిన ప్రేమ కథా చిత్రం, జక్కన్న సూపర్ హిట్స్ గా మా సంస్థ కు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రేమ కథా చిత్రం హిలేరియస్ కామెడీ తో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ప్రేమ కథా చిత్రం 2 ప్రారంభించాం. సుమంత్ ఆశ్విన్ హీరోగా నటిస్తున్నారు. హరి కిషన్ ను దర్శకుడు గా పరిచయం చేస్తున్నాం.
కామెడీ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే కథ ఇది. మా బ్యానర్ కి మరొక సూపర్ హిట్ చిత్రం గా నిలుస్తుందని నమ్ముతున్నాం. సీనియర్ కెమెరామెన్ సి.రాం ప్రసాద్, ఎడిటర్ ఉద్ధవ్, సంగీతం జెబి డైలాగ్ రైటర్ చంద్ర శేఖర్ లాంటి టెక్నీషియన్స్ మెయిన్ పిల్లర్స్ గా ఈ సినిమా రూపొందిస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం''. అని నిర్మాత - ఆర్. సుదర్శన్ రెడ్డి అన్నారు.
సాంకేతిక నిపుణులు : కెమెరామెన్ - సి. రాం ప్రసాద్, ఎడిటర్ - ఉద్ధవ్, సంగీతం - జెబి, డైలాగ్ రైటర్ - చంద్ర శేఖర్, ఆర్ట్ - అశోక్, కో ప్రొడ్యూసర్స్ ఆయుష్ రెడ్డి, ఆర్ పి అక్షిత్ రెడ్డి, నిర్మాత - ఆర్. సుదర్శన్ రెడ్డి, దర్శకుడు - హరి కిషన్