ఫన్,ఫియర్, రొమాన్స్ ...('ప్రేమ కథా చిత్రమ్' ప్రివ్యూ)
హైదరాబాద్ : సుధీర్‌బాబు, నందిత జంటగా నటించిన చిత్రం 'ప్రేమ కథా చిత్రమ్'. జె.ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ రోజు(శుక్రవారం) విడుదల అవుతోంది. ఎస్.ఎమ్.ఎస్ చిత్రంతో పరిచయమైన సుధీర్ బాబుకి ఇది రెండో చిత్రం. ఈ చిత్రంలో తన లోపాలు సైతం సరిచేసుకుని...కష్టపడ్డానని, ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఆయన నమ్మకంగా ఉన్నారు.
అలాగే ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నారు. 350 థియోటర్స్ లో ఆంధ్రాలో..అందులో కేవలం 26 థియోటర్స్ హైదరాబాద్ లోనూ ఉన్నాయి. ఇప్పటికే ట్రైలర్స్,ఫస్ట్ లుక్ క్రేజ్ తేవటంతో చిత్రంకి మంచి ఓపినింగ్స్ వస్తాయని అంతా భావిస్తున్నారు. అందులో మారుతి బ్రాండ్ ఇమేజ్ కూడా పనికివస్తుందని అంచనాలు వేస్తున్నారు.
'ప్రేమకథా చిత్రమ్'లో ఉన్న పాయింటు సరికొత్తగా ఉంటుందని, ఓ లవ్‌స్టోరీని ఇలా కూడా రాయవచ్చా? అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయోలా ఉంటుంది. యువతీ యువకులు ప్రేమలో మోసమోయి, ఆత్మహత్య చేసుకునే క్రమంలో ఈ కథ సరికొత్తగా మారుతుందని, నలుగురు వ్యక్తుల మధ్య జరిగే ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉందని, ఓ మంచి కథనంతో దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అందరికీ నచ్చుతుందని సధీర్ బాబు కథ గురించి చెప్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''ప్రేమంటే గెలుపే కాదు. ఒక్కోసారి ఓటమి కూడా ఉంటుంది. ప్రేమలో ఓడిపోయిన ఓ జంట తీసుకున్న నిర్ణయం వారి జీవితాల్ని ఎలా ప్రభావితం చేసిందనే ఆసక్తికరమైన కథాంశంతో చిత్రాన్ని మలిచాం. మారుతి నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా ఉంటుందీ చిత్రం'' అని చెప్పారు.
బ్యానర్ :ఆర్.పి.ఎ. క్రియేషన్స్, మారుతీ టాకీస్
నటీనటులు: సుధీర్ బాబు, నందిత, ప్రదీప్, హాసిక, అదుర్స్ రఘు, ఏలూరు శ్రీను, రణధీర్ తదితరులు .
ఆర్ట్: గోవింద్,
సంగీతం: జేబీ,
ఎడిటింగ్: ఉద్ధవ్,
నిర్మాతలు: మారుతి, సుదర్శన్ రెడ్డి,
కథ-స్క్రీన్ ప్లే, మాటలు: మారుతి,
సినిమాటోగ్రఫీ- దర్శకత్వం: జె. ప్రభాకర్ రెడ్డి.


Click it and Unblock the Notifications












