మావాడిలో ఆ సత్తా ఉంది: మహేష్ (PKC ఆడియో ఫోటోలతో)

By Bojja Kumar

హైదరాబాద్: మా వాడిలో పెద్ద స్టార్ అయ్యే సత్తా ఉందంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు... తన బంధువు సుధీర్‍‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సుధీర్ హీరోగా రూపొందిన 'ప్రేమ కథా చిత్రం' ఆడియో వేడుక శుక్రవారం శిల్పకళా వేదికలో జరుగగా మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ 'సుధీర్ హార్డ్ వర్క్, డిసిప్లైన్ నాకు చాలా ఇష్టం. ఈ రెండు క్వాలిటీలు చాలు పెద్ద స్టార్ కావడానికి. తక్కువ బడ్జెట్లో ఇన్నోవేటివ్ గా సినిమాలు చేయడం చాలా కష్టం.... కానీ మారుతి చేసి చూపెట్టారు. ఈ సినిమాకూడా పెద్ద హిట్టవ్వాలి ని కోరుకుంటున్నాను' అన్నారు.

సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ..'ఈ రోజుల్లో, బస్టాప్ చిత్రాలు విజయవంతం అయ్యాయి. అలాంటి చిత్రాలను చేసిన మారుతితో సుధీర్ పని చేయడం ఆనందంగా ఉంది. పచ్చని కాపురం చిత్రంలోని వెన్నెలైనా వేకువైనా పాటను ఈచిత్రంలో రీమిక్స్ చేస్తున్నారు. అప్పట్లో ఆ పాట పెద్ద హిట్. ఇప్పుడు 'ప్రేమ కథా చిత్రం' ఆడియో, సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను' అన్నారు.

మిగతా వివరాలు స్లైడ్ షోలో...

మావాడిలో ఆ సత్తా ఉంది: మహేష్ (PKC ఆడియో ఫోటోలతో)

సుధీర్ మాట్లాడుతూ.. ముందుగా దూకుడు చిత్రానకి నంది అవార్డ్ తీసుకున్న మహేష్ బాబుకు కంగ్రాట్స్ చెబుతున్నాను. మారుతితో చేయడానికి ముందు చాలా మంది భయ పెట్టారు.

మావాడిలో ఆ సత్తా ఉంది: మహేష్ (PKC ఆడియో ఫోటోలతో)

కానీ ఎవరి మాట వినకుండా ఆయన చేసిన రెండు హిట్ చిత్రాలు చేసారనే నమ్మకంతో ఒప్పుకున్నాను. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నన్ను, నా తొలి సినిమాను ఆదరించారు. ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

మావాడిలో ఆ సత్తా ఉంది: మహేష్ (PKC ఆడియో ఫోటోలతో)

దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘సినిమాలో కృష్ణ గారి పాటను వాడుకునే సందర్బం ఉంది కాబట్టి వాడుకున్నాం. పచ్చని కాపురంలోని పాటను చెడగొట్టకుండా ఒళ్లు దగ్గర పెట్టుకుని చేసాం. సుధీర్, నందిత ఆ పాటకు మంచి ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు, సినిమా అందరికీ నచ్చుతుంది' అన్నారు.

మావాడిలో ఆ సత్తా ఉంది: మహేష్ (PKC ఆడియో ఫోటోలతో)

ఈ కార్యక్రమంలో విజయనిర్మాల, డివివి దానయ్య, బెల్లకొండ సురేష్, సంతోష్ శ్రీనివాస్, శ్రీను వైట్ల, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి జె.బి సంగీతం అందించారు. జె ప్రభాకర్‌ రెడ్డ దర్శకుడు. ఆర్‌.పి.ఎ క్రియేషన్స్‌ పతాకంపై సుదర్శన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. మారుతి ఈచిత్రానికి సమర్పకులు.

మావాడిలో ఆ సత్తా ఉంది: మహేష్ (PKC ఆడియో ఫోటోలతో)

ప్రేమ కథా చిత్రం ఆడియో వేడుక దృశ్యాలు

మావాడిలో ఆ సత్తా ఉంది: మహేష్ (PKC ఆడియో ఫోటోలతో)

ప్రేమ కథా చిత్రం ఆడియో వేడుక దృశ్యాలు

మావాడిలో ఆ సత్తా ఉంది: మహేష్ (PKC ఆడియో ఫోటోలతో)

ప్రేమ కథా చిత్రం ఆడియో వేడుక దృశ్యాలు

మావాడిలో ఆ సత్తా ఉంది: మహేష్ (PKC ఆడియో ఫోటోలతో)

ప్రేమ కథా చిత్రం ఆడియో వేడుక దృశ్యాలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X