‘ప్రేమకథా చిత్రమ్’ విడుదల వాయిదా?
హైదరాబాద్ : మహేష్ బాబు బ్రదరిల్లా సుధీర్‌బాబు, నందిత జంటగా జె.ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వంలో, మారుతి నేతృత్వంలో నిర్మించిన 'ప్రేమకథా చిత్రమ్' మే నెల 11న విడుదల చేస్తున్నట్లు ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం జూన్ నెలకి వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ స్టేట్ మెంట్ వెలువడాల్సి ఉంది.
సినిమా గురించి హీరో సుధీర్‌బాబు కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ- రెండో చిత్రంతోనే మారుతితో పనిచేసే అవకాశం రావడం ఆనందంగా వుందని, చిత్రంలో నటించినవారందరూ బాగా చేశారని, సినిమా ప్రేక్షకులను ఎంటర్టెన్ చేస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఇటీవల విడుదలకు పాటలకు మంచి రెస్పాన్స్ రావడం ముఖ్యంగా రీమిక్స్ సాంగ్ కృష్ణ అభిమానులకు ఎంతో నచ్చిందని, మారుతి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించానని దర్శకుడు జె.ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
తన గత చిత్రాలకన్నా ఈ చిత్రం సరికొత్త జోనర్‌లో నాన్‌స్టాప్ కామెడీతో ఆరోగ్యకరమైన కుటుంబ కథా చిత్రం రూపొందించామని, ట్రైలర్లకు మంచి స్పందన లభిస్తోందని, తమ సంస్థనుండి ప్రేక్షకులు ఎటువంటి చిత్రాన్ని కోరుకుంటారో అటువంటి చిత్రంగా ప్రేమకథా చిత్రమ్ ఉంటుందని తెలిపారు.
మారుతి మాట్లాడుతూ ''నా చిత్రాల మాదిరిగానే ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడా మిస్ కాకుండా కొత్త జోనర్‌లో ఈ చిత్రాన్ని చేశాము. అందరూ రెండు గంటలపాటు చక్కగా నవ్వుకుంటారు. నవ్వు కుంటూనే అవాక్కయ్యే సీన్లు చాలా ఉన్నాయి. సుధీర్ బాబు, నందితల నటన ఈ చిత్రానికే హైలైట్‌గా నిలు స్తాయి. సంగీతం,ఎడిటింగ్ పెద్ద అసెట్‌గా నిలుస్తాయిఅని అన్నారు.


Click it and Unblock the Notifications











