'ప్రేమ కథా చిత్రమ్' విడుదల తేదీ ఖరారు
హైదరాబాద్ : సుధీర్‌బాబు, నందిత జంటగా నటించిన చిత్రం 'ప్రేమ కథా చిత్రమ్'. జె.ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. మారుతి, ఆర్.సుదర్శన్‌రెడ్డి నిర్మాతలు. మే 11న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ''ప్రేమంటే గెలుపే కాదు. ఒక్కోసారి ఓటమి కూడా ఉంటుంది. ప్రేమలో ఓడిపోయిన ఓ జంట తీసుకున్న నిర్ణయం వారి జీవితాల్ని ఎలా ప్రభావితం చేసిందనే ఆసక్తికరమైన కథాంశంతో చిత్రాన్ని మలిచాం. మారుతి నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా ఉంటుందీ చిత్రం'' అని చెప్పారు.
మారుతి మాట్లాడుతూ '' యూనిట్ అంతా తమ సొంత సినిమాలా పనిచేశారు. భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. వినోదానికి పెద్దపీట వేశాం. ప్రకటన చిత్రానికి స్పందన బాగుంది. ఈ సినిమాకు నేనే దర్శకత్వం వహిద్దామని అనుకున్నాను. కానీ ఇతర ప్రాజెక్టుల వల్ల దర్శకత్వ బాధ్యతలు ప్రభాకర్ రెడ్డికి అప్పగించాను. కథ, స్క్రీన్ ప్లే, మాటలు నేనే సమకూర్చాను. సుదీర్ అడగ్గానే ఒప్పుకున్నందుకు సంతోషంగా ఉంది. సినిమా డిఫరెంట్ గా ఉంటుంది''అన్నారు.
''ఈ వేసవిలో ప్రేక్షకులకు సేదతీర్చే చిత్రమిది. పాటలకి మంచి స్పందన వచ్చింది. మారుతితో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా'' అన్నారు సుధీర్‌బాబు. ఈ చిత్రంలో ... ప్రదీప్, హాసిక, అదుర్స్ రఘు, ఏలూరు శ్రీను, రణధీర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్: గోవింద్, సంగతం: జేబీ, ఎడిటింగ్: ఉద్ధవ్, నిర్మాతలు: మారుతి, సుదర్శన్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే, మాటలు: మారుతి, సినిమాటోగ్రఫీ- దర్శకత్వం: జె. ప్రభాకర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











