జూన్ 7న సుధీర్ బాబు ‘ప్రేమ కథా చిత్రం’

By Bojja Kumar

హైదరాబాద్ : సుధీర్‌బాబు, నందిత జంటగా జె.ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన 'ప్రేమకథా చిత్రమ్' జూన్ 7న విడుదలకు సిద్ధమౌతోంది. మారుతి సమర్పణలో ఆర్.పి.ఏ క్రియేషన్స్ అండ్ మారుతి టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మారుతి మరియు ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతలు.

ఈ సందర్భంగా నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ...'సుధీర్ బాబు హీరోగా మా సంస్థలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమకథా చిత్రమ్' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇటీవలే సెన్సారు కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేస్తున్నామని తెలిపారు.

ఈ రోజుల్లో, బస్టాప్ చిత్రాలకు సూపర్బ్ సంగీతం అందించిన జే.బి మా ప్రేమకథా చిత్రమ్‌కి కూడా అదే రేంజిలో సంగీతాన్ని అందించాడు. ఈ ఆడియో ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ కాగా సినిమా కూడా ఆద్యంతం అబ్యుర పరిచేలా అందరినీ ఆకట్టుకుంది. కేవలం నాలుగు పాత్రలతో ఊహించని ప్రేమకథగా తెరకెక్కింది. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లు, దర్శకత్వ పర్యవేక్షణ దర్శకుడు మారుతి నిర్వహించారు. చక్కగా వేసవిలో ఫ్యామిలీ అంతా కలిసి హీయిగా నవ్వుకునే చిత్రంగా మా ప్రేమకథా చిత్రం ఉంటుందని సుదర్శన్ రెడ్డి తెలిపారు.

చిత్ర సమర్పకుడు, నిర్మాత మారుతి మాట్లాడుతూ...నా చిత్రాల మాదిరిగానే ఎంటర్ టైన్మెంట్ ఎక్కడా మిస్ కాకుండా కొత్త జోనర్‌లో ఈ చిత్రాన్ని చేసాము. అందరూ రెండు గంటల సేపు చక్కగా నవ్వుకుంటారు. నవ్వుకుంటూనే అవాక్కయ్యే సీన్స్ చాలా ఉన్నాయి. హీరో సుధీర్ బాబుకు, నందితల నటన ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయని తెలిపారు.

ఇటీవల విడుదలకు పాటలకు మంచి రెస్పాన్స్ రావడం ముఖ్యంగా రీమిక్స్ సాంగ్ కృష్ణ అభిమానులకు ఎంతో నచ్చిందని, మారుతి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించానని దర్శకుడు జె.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తన గత చిత్రాలకన్నా ఈ చిత్రం సరికొత్త జోనర్‌లో నాన్‌స్టాప్ కామెడీతో ఆరోగ్యకరమైన కుటుంబ కథా చిత్రం రూపొందించామని, ట్రైలర్లకు మంచి స్పందన లభిస్తోందని, తమ సంస్థనుండి ప్రేక్షకులు ఎటువంటి చిత్రాన్ని కోరుకుంటారో అటువంటి చిత్రంగా ప్రేమకథా చిత్రమ్ ఉంటుందని తెలిపారు. ఈచిత్రానికి సమర్పకుడు : మారుతి, నిర్మాతలు : సుదర్శన్ రెడ్డి, మారుతి, సహ నిర్మాతలు : ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి, ఎడిటింగ్ : ఉద్ధవ్, సినిమాటోగ్రీఫ్-దర్శకత్వం : జె ప్రభాకర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వ పర్యవేక్షణ : మారుతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X