ఆత్మహత్యకు సిద్దపడ్డ జంట కథే... 'ప్రేమకథా చిత్రమ్‌'

By Srikanya

హైదరబాద్ : ఈరో జుల్లో, బస్‌స్టాప్‌ సక్సెస్‌ల తర్వాత మారు తి స్వీయ దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిం చిన చిత్రం 'ప్రేమకథా చిత్రమ్‌'. సుధీర్‌బా బు-నందిత హీరో,హీరోయిన్స్ గా ఆర్‌.పి.ఏ క్రియేష న్స్‌-మారుతి టాకీస్‌ సంయుక్తంగా నిర్మిం చాయి. సుదర్శ నరెడ్డి నిర్మాత. ఈరోజు ల్లో' ఛాయాగ్రాహకుడు జె.ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. . వచ్చే నెల 7న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రేమలో ఓడిపోయి చావే శరణ్యం అనుకొంది ఓ జంట. ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యారు. అనుకోని పరిస్థితుల్లో వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకొన్నారు. ఆ పరిస్థితులు ఏమిటి? ఆ తరవాత ఏం జరిగిందీ తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు జె.ప్రభాకర్‌రెడ్డి.

అలాగే... ''నాలుగు పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. కామెడీ, ఫీల్‌ హైలై ట్‌గా ఉం టుంది. యువత సహా కుటుంబ ప్రేక్షకులకు నచ్చుతుంది. విజయానికి మీ ఆశీస్సులు కావవాలి'' అన్నారు.

మారుతి మాట్లాడుతూ-''ఫన్‌, ఫియర్‌, రొమాన్స్‌ అన్నిటినీ రంగరించి అందంగా ముస్తాబు చేసిన చిత్రమిది. సుధీర్‌ ఓ హీరో లా కాకుండా నటుడిలా కనిపిస్తారు. నందిత నటనాభి నయం హైలైట్‌. కేవలం నాలుగు పాత్రలతో సినిమా రూపొందించాం. వినోదంతోపాటు ఉలిక్కిపడేలా కథలో మలుపులు ఉంటాయి. జె.బి. స్వరపరచిన గీతాలు అందరికీ నచ్చుతాయి'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X