'ప్రేమ ఒక మైకం' విడుదల తేదీ ఖరారు
చిత్రం గురించి ఛార్మి మాట్లాడుతూ... అందరూ మల్లిక అందాన్ని చూశారు. ఎందుకంటే ఆమె ఓ వేశ్య కాబట్టి. ఆమెను అవమానించినవాళ్లే తప్ప... ఆప్యాయంగా పలకరించినవాళ్లు తక్కువ. అందుకే మల్లికకీ మానవ సంబంధాలపై నమ్మకం పోయింది. లలిత్ ఆమె జీవితంలోకి ప్రవేశించిన తరవాత ఆలోచనలో మార్పు వచ్చింది. ఆ మార్పు ఏ దిశగా అన్నది తెర మీదే చూడాలని చెప్పింది.
దర్శకుడు మాట్లాడుతూ ''చీకట్లో పుట్టి చీకట్లో బతుకుతూ చీకట్లో కలిసిపోయే జీవితాలు మీవి అంటూ మల్లిక అవమానానికి గురవుతుంది. ఆ సమయంలోనే లలిత్ పరిచయమవుతాడు. అప్పుడామె తీసుకున్న నిర్ణయం ఏమిటన్నది తెర మీదే చూడాలి. మనసున్న మల్లికగా ఎలా నిలబడిందన్నది ఆసక్తికర అంశం. ఛార్మి నటన యువతకు నచ్చుతుంది''అన్నారు.
సోనీ చరిష్టా, సతీష్, చంద్రమోహన్, రావు రమేష్, తాగుబోతు రమేష్, పృథ్వీ, సురేఖ వాణి, చంటి, జాకీ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి మాటలు: పులగం సి. నారాయణ, కెమెరా: ప్రవీణ్ బంగారి, పాటలు: కుల శేఖర్, శశి, సమర్పణ: బేబీ హ్యాపీ.


Click it and Unblock the Notifications
