ఒక్క డైలాగుని లక్ష పెట్టి కొన్నారా?
హైదరాబాద్: అక్షర లక్షల అనటం విన్నాం కానీ ఇలా మరీ డైలాగుకు లక్ష రూపాయలు ఇవ్వటం ఇదే తెలుగు పరిశ్రమలో మొదటి సారేమో. ఎజి అండ్ ఎజి ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై జె.వి.రెడ్డి నిర్మిస్తున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ "ప్రేమలో ఎబిసి'' . ఈ చిత్రంలో ఓ గొప్ప డైలాగు ఉంటుందని, అది లక్ష రూపాయలకు కొన్నామని నిర్మాత చెప్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ...పంచ్ డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా ఓ డైలాగ్‌ని రచయిత నుంచి రూ.లక్ష వెచ్చించి కొనుక్కున్నాం. వాస్తవంగా వేరే సినిమా కోసం రాసుకున్న ఆ డైలాగ్ నచ్చి అంత పెద్ద మొత్తాన్ని చెల్లించాను. థియేటర్‌లో చూసిన ప్రేక్షకుడు ఆ డైలాగ్‌ని గుర్తిస్తే అతడికి బహుమతి అందిస్తాం అన్నారు.

అలాగే... మా సినిమాలో ఒక్క అమ్మాయి ముగ్గురు అబ్బాయిల్ని చెడుగుడు ఆడుతుంది. ఆ అమ్మాయి చెడ్డదా? మంచిదా? అబ్బాయిల్ని ఎందుకోసం చెడుగుడు ఆడింది? ఇవన్నీ తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు జె.వి.రెడ్డి. ఈ సినిమా అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ యుఎ సర్టిఫికెట్‌తో గౌరవించింది. జూలై 4న దాదాపు 200పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.
తలారి నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అజయ్,రిషి, రూబిపరిహార్, శ్రీ బరా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్ర దర్శకుడు తలారి నాగరాజు మాట్లాడుతూ ఈ చిత్రం ఇంత బాగా రావడానికి ముఖ్య కారకులైన మా చిత్ర బృందానికి నా ధన్యవాదాలు,. నన్ను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించిన మా నిర్మాత జె.వి.రెడ్డి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.


Click it and Unblock the Notifications











