twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూపర్ హిట్ 'ప్రేమమ్‌' పైరసీ : 3 స్టూడెంట్స్ అరెస్ట్

    By Srikanya
    |

    తిరువనంతపురం: రీసెంట్ గా మళయాళంలో విడుదలై భారీ విజయం సాధించిన ప్రేమ కధా చిత్రం 'ప్రేమమ్‌' . ఈ చిత్ర పైరసీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పైరసీ చేశారంటూ ఆ చిత్ర నిర్మాత అన్వర్‌ రషీద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసారు.

    ఈ నేపథ్యంలో పోలీసులు తిరువనంతపురంకు చెందిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు 18 సంవత్సరాలలోపు వయస్సు వారేనని పోలీసులు తెలిపారు. విచారణ జరుపుతున్నట్లు వారు చెప్పారు. సినిమా విడుదలైన కొద్దిరోజులకే చిత్రాన్ని పైరసీ చేసి కొన్ని ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలో ఉంచారు. దీంతో ఆ చిత్ర నిర్మాత పోలీసులను ఆశ్రయించారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇప్పుడు సిని ప్రియుల నోళ్లలో నానుతున్న చిత్రం 'ప్రేమమ్' . ఈ మళయాళ చిత్రం ఊహించని విధంగా ఘన విజయం సాధించింది. నివిన్ పౌలీ ఈ చిత్రంతో హీరో గా పరిచయమయ్యారు. ఆల్ఫోన్సే పూతరేన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కింది. మే 29న విడుదలయిన ఈ చిత్రం పెద్ద హిట్టయ్యింది.

    'Premam' piracy: 3 students arrested, foreign link exposed

    ఇప్పటికీ హౌస్ ఫుల్ షోస్ తో జనాన్ని విశేషంగా ఆకట్టుకుంటూ ఉన్న ఈ చిత్రాన్ని ఆన్ లైన్ లీకేజి కు కారణంగా వీరినే టార్గెట్ చేయటానికి కారణమాలు మళయాళ మీడియాలో ఇప్పుడు ఊపందుకున్నాయి. ప్రేమమ్ సెన్సార్ కాపీ...లీక్ అయ్యింది. ఈ సెన్సార్ కాపీ.. ..విశ్వమాయ మాక్స్, ఫోర్ ఫ్రేమ్ నుంచి బయిటకు వచ్చింది.

    ప్రేమమ్ సినిమా విషయానికొస్తే...

    మే 29 న విడుదలయిన ప్రేమమ్ ఒక్క కేరళ లోనే 20 కోట్లు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలో కేరళ స్టర్స్ మమ్ముట్టి , మోహన్ లాల్ లాంటి వారు ఎవరూ లేక పోయినా బాక్సాఫీసు వద్ద కాసులు కురిపిస్తోంది.

    జార్జ్ అనే కుర్రాడు టీనేజ్ లో, కాలేజ్ లో, సెటిలేజ్ లో ముగ్గురు అమ్మాయిలను ప్రేమిస్తాడు. వారి ప్రేమను సాధించుకోవటం లో ఊహించని అడ్డంకులు ఎదురై ,కలలు కరిగిపోయి ప్రేమించిన వారు మరొకరితో సెటిల్ అవ్వతుంటారు. ఈ పరిణామాలను దర్శకుడు అల్ఫోన్సో పుత్తరేన్ మనసుకు హత్తుకునే చూపించారు.

    జూన్ నెలలో విడుదలైన ఈ 'ప్రేమమ్' చిత్రం టాక్ బాగుండటంతో ... విదేశాలలోనూ విడుదల చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా వసూళ్ళు యాభై కోట్లకు చేరుకున్నాయి. మళయాళ పరిశ్రమలో ఇలా లో బడ్జెట్ చిత్రం ఈ రేంజిలో హిట్ అయ్యి..ఇంత వసూలు చేయటం పెద్ద రికార్డు. ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం తెలుగు, తమిళ, కన్నడ భాషల నుండే కాకుండా హిందీ పరిశ్రమనుండీ మంచి డిమాండ్ ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.

    English summary
    In a crucial breakthrough in the probe into piracy of Malayalam blockbuster 'Premam', the Anti-Piracy Cell of Kerala Police on Tuesday arrested three Plus Two students, who allegedly uploaded the 'censor copy' of the movie on the Internet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X