హీరోగా సంగీత దర్శకుడు కోటి తనయుడు

By Bojja Kumar

హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ‘ప్రేమంటే సులవు కాదురా'. సిమ్మీదాస్‌ హీరోయిన్‌. ఈ చిత్రం ద్వారా చందా గోవింద్‌రెడ్డి అనే యువదర్శకుడు పరిచయం చేస్తున్నారు. ఆర్‌.పి.క్రియేషన్స్‌ పతాకంపై భవనాసి రాంప్రసాద్‌ నిర్మిస్తున్న వినూత్న ప్రేమకథా చిత్రం ఇది. కొమారి సుధాకర్‌రెడ్డి-శ్రీపతి శ్రీరాములు సహ నిర్మాతలు.

Premante Suluvu Kadura

ఈ చిత్రం ఆడియో.. డిసెంబర్‌ 6 న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ ‘మధుర మ్యూజిక్‌' ద్వారా విడుదల కానుంది. హైద్రాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌ ప్రివ్యూ ధియేటర్ ఇందుకు వేదిక కానుంది. పలువురు ప్రముఖులు ఈ పాటల వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొంటున్నారు.

కృష్ణ మదినేని సాహిత్యం సమకూర్చిన ఈ చిత్రానికి యువ సంగీత తరంగం నందన్‌రాజ్‌ స్వర సారధ్యం వహిస్తుండగా.. ‘ప్రాణం' కమలాకర్‌ నేపధ్య సంగీతం అందిస్తున్నారు!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X