‘ప్రేమికుడు’ పాటల రికార్డింగ్
శ్రీ అనూరాధ ప్రొడక్షన్స్‌పతాకంపై రవిరామ్ హీరోగా డి.రాజేష్ దర్శకత్వంలో భూషన్‌గౌడ్ నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమికుడు పాటల రికార్డింగ్ జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ 'యువత మెచ్చే సరికొత్త కథాంశంతో ఈ చిత్రం రూపొందుతుంది. ప్రేమ, సెంటిమెంట్‌తో పాటు సస్పెన్స్‌మిళితమై వుంటుంది. అంతర్లీనంగా సందేశం వుంటుంది. కథానాయికను ఇంకా ఎంపిక చేయాల్సివుంది అన్నారు.
నటులు అశోక్‌కుమార్ మాట్లాడుతూ 'సామాజిక స్పృహతో పాటు రొమాంటిక్ ఎలిమెంట్స్‌వున్న కథాంశమిది. ఈ చిత్రంలో మంచి పాత్రను చేస్తున్నాను అన్నారు. నిర్మాత భూషన్‌గౌడ్ మాట్లాడుతూ 'వినూత్న కథాంశంతో ఈ చిత్రం రూపొందుతుంది. సెప్టెంబర్ రెండవ వారంలో చిత్రాన్ని ప్రారంభించి హైదరాబాద్, వరంగల్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం. సింగిల్ షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తిచేస్తాం అన్నారు. వేణుమాధవ్, చలపతిరావు, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాజేంద్ర, నిర్మాత: భూషన్‌గౌడ్, దర్శకత్వం: డి.రాజేష్.


Click it and Unblock the Notifications











