భానుమతి పురస్కారంతో జమనకు సత్కారం

By Srikanya

పద్మశ్రీ డాక్టర్ భానుమతి రామకృష్ణ 88వ జయంతిసందర్భంగా అలనాటి మేటి నటీమణి జమునకు 'భానమతి-వంశీ' పురస్కారాన్ని అందించారు. రవీంద్రభారతిలో మంగళవారం రాత్రి.. టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్, వంశీ ఇంటర్నేషనల్, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.లభానుమతి, జమునల నటనా వైదుష్యాన్ని గురించి ఘనంగా ప్రస్తావించారు. ఇద్దరూ బహుముఖీన ప్రతిభతో పాటు ఆత్మవిశ్వాసంతో తాము నటించిన పాత్రలకు ప్రాణం పోశారని ప్రశంసించారు.

భానుమతితో తాను కొన్ని సినిమాల్లో నటించానని సినీ నటుడు మురళీమోహన్ అధ్యక్షోపన్యాసంలో తెలిపారు. జమున రాజకీయాల్లోకి వచ్చి రంగస్థల, సినీ కళాకారుల సంక్షేమం కోసం విశేష కృషి చేశారన్నారు.తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. వంశీ, గిఫ్ట్ సంస్థల వ్యవస్థాపకుడు వంశీ రామరాజు.. తమ సంస్థ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో భాగంగా.. పలువురు గాయనీగాయకులు భానుమతి నటించిన చిత్రాల్లోని ఆణిముత్యాల్లాంటి పాటల్ని ఆలపించి శ్రోతల్ని అలరింపజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X