అశ్లీలంగా నటించకపోతే అలాంటి రావు??
గాంధిజయంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గాంధీ గారి స్వస్థలమైన గుజరాత్ లోని పోర్ బందర్ లోని 'సబర్మతి" ఆశ్రమాన్ని సందర్శించి ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా'మహాత్మ గాంధీ" గారి ('జీవిత చరిత్ర") ను 'మై లైఫ్ ఈజ్ మై మెసేజ్" నాలుగు విలువైన మూలగ్రంధాన్ని ప్రధాన భాషల్లో అనువదించాలని ప్రకటన చేశారు. తర్వతా గుజరాత్ లోని 'గాంధీజీ ఆశ్రమా"నికి వచ్చిన ఆమో విద్యార్ధులతో ఇష్టంగా, అప్యాయతగా చర్చిస్తుండగా ఒక విద్యార్ధిని అడిగిన ప్రశ్నకు రాష్ట్రపతి సమాదానం ఇస్తూ భారత మహిళలు అగౌరవకరమైన రీతిలో అశ్లీలంగా చిత్రీకరిస్తున్న వాణిజ్య ప్రకటనల్లో సైతం నటించే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని రాష్ట్ర పతి ప్రతిభా పాటిల్ సూచించారు. ఇటువంటి ప్రకటనలకు దూరంగా ఉండాలని కోరారు. మహిళలు నటించక పోతే అలాంటి ప్రకటనలు రావని ఆమె అన్నారు. వాణిజ్య ప్రకటనల్లో అశ్లీలాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఆంక్షలు విధించనుందని తెలిపారు.


Click it and Unblock the Notifications











