నిద్ర పట్టడం లేదు, మా అక్క గుర్తు చేసింది.. ఆ సీన్‌లో నాన్న లాగే, బన్నీ సినిమా గురించి మహేష్!

Recommended Video

Mahesh Babu liplock's With Namrata is Going Viral

సూపర్ స్టార్ మహేష్ నటించిన భరత్ అనే నేను చిత్రం రికార్డుల వేట మొదలుపెట్టింది. బ్లాక్ బాస్టర్ టాక్ సొంతం చేసుకున్న భారత నేను చిత్రం వసూళ్ల పరంగా ప్రభంజనం సృష్టిస్తోంది. పొలిటికల్ నేపథ్యంలో ఈ చిత్రం వచ్చినా అన్ని కమర్షియల్ అంశాలతో దర్శకుడు కొరటాల శివ అదరగొట్టేశాడు. మహెష్ ని ఆయన సీఎం గా ప్రజెంట్ చేసిన విధానం అద్భుతం. ఈ చిత్రంలో మహేష్ మరింత స్టైలిష్ గా కనిపించాడు. పొలిటికల్ డ్రామాని నడిపిస్తూనే, మంచి సందేశాన్ని, కమర్షియల్ అంశాలని ప్రేక్షకులకు అందించారు. మహెష్ బాబు ఈ చిత్రంలో నటించిన తీరుకు అభినందించని వారంటూ లేరు. భరత్ అనే నేను చిత్రం తన కెరీర్ లో బెస్ట్ పపెర్ఫామెన్స్ అని మహేష్ స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో తెలిపాడు.

నిద్ర పట్టడంలేదు

నిద్ర పట్టడంలేదు

సినిమా విడుదల 10 రోజుల ముందు నుంచి సరిగా నిద్ర పట్టలేదని మహేష్ తెలిపాడు. విడుదల తరువాత వస్తున్న అద్భుత స్పందనతో ఇప్పుడు కూడా నిద్రపట్టడం లేదని మహేష్ తెలిపాడు. భరత్ అనే నేను పవర్ ఫుల్ మూవీ గా మహేష్ అభివర్ణించాడు.

మా అక్కే గుర్తు చేసింది

మా అక్కే గుర్తు చేసింది

మా అమ్మ పుట్టిన రోజు, భరత్ అనే నేను చిత్రం విడుదల ఒకే రోజు కావడం చాలా సంతోషంగా అనిపించిందని మహేష్ తెలిపాడు. మా అమ్మ పుట్టిన రోజు సంగతిని సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు మా అక్క గుర్తు చేసిందని మహేష్ తెలిపాడు.

అల్లు అర్జున్ సినిమా గురించి

అల్లు అర్జున్ సినిమా గురించి

మొదట భరత్ అనే నేను చిత్రాన్ని ఏప్రిల్ 27 న విడుదల చేయాలని నిర్ణయించాం. కానీ నా పేరు సూర్య చిత్రం కూడా అదేరోజు విడుదల అవుతుందని తెలిసి ఇద్దరం విడుదల తేదీల్ని మార్చుకున్నాం అని మహేష్ తెలిపాడు. అలా అనుకోకుండా మా అమ్మ పుట్టిన రోజున ఈ చిత్రం విడుదలైందని మహేష్ తెలిపాడు.

 వివాదాలు లేవు

వివాదాలు లేవు

భరత్ అనే నేను చిత్రం రాజకీయ నేపథ్యంలో వచ్చినప్పటికీ ఇందులో ఎలాంటి వివాదాలు లేవు అని మహేష్ తెలిపాడు. ఈ చిత్రంలో ట్రాఫిక్ రూల్స్ గురించి సన్నివేశం ఉంది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించేటప్పుడు మా చిత్రం మదిలో మెదిలితే చాలు అని మహేష్ అన్నాడు.

కొరటాల శివకు హ్యాట్సాఫ్

కొరటాల శివకు హ్యాట్సాఫ్

దుర్గమహల్ ఫైట్ సన్నివేశం ఈ చిత్రంలో హైలైట్ అని మహేష్ తెలిపాడు. అలాగే ఫ్రెస్ మీట్ సన్నివేశాల కూడా. ప్రెస్ మీట్ సన్నివేశంలో డైలాగులు తన గుండె లోతుల్లోనుంచి వచ్చాయని మహేష్ బాబు తెలిపాడు. ఆ సన్నివేశానికి అద్భుతమైన స్పందన వస్తుండడంతో సంతోషంగా ఉందని మహెష్ తెలిపాడు.

నాన్నగారు గుర్తుకు వచ్చారు

నాన్నగారు గుర్తుకు వచ్చారు

మీసంతో ఉండడం తనకు అలవాటు లేదని మహేష్ తెలిపాడు. కానీ ఓ సాంగ్ లో అలా కనిపించానని నాని తెలిపాడు. మీసం లో నన్ను నేను చూసుకుంటే నాన్నగారే గుర్తువచ్చారని మహేష్ తెలపడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X