వర్మా మరో థ్రిల్లింగ్ మూవీ ‘ఫూంక్-2’
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మా చాలా కాలం విరామం తర్వాత తనదైన స్టైల్ లో యథావిధిగా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరితో 'ఫూంక్" అనే సినిమాను మళ్ళి తెరపైకి తీయబోతున్నారు. రొటీన్ కి భిన్నంగా సినిమాలు తీయడంలో తనకు తానే సాటి అన్నవారిలో రామ్ గోపాల్ ఒక్కరు. రామ్ గోపాల్ వర్మ హిందీలో తీసిన 'ఫూంక్' (తెలుగులో 'రక్ష') చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ సింపుల్ గా తీస్తున్నారు. ఈ సినిమాను ఓ రియాలిటీ హర్రర్ చిత్రంగా చిత్రీకరిస్తామని చెప్పారు. వర్మ సమర్పణలో ప్రశాంత్ బుర్రా, పి.చంద్రశేఖర్ నిర్మాతలుగా మిలింద్ గడాఖర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. దీనిని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నట్టు వర్మ తెలిపారు. హైదరాబాద్ లోని తాజ్ బంజారాలో శనివారం జరిగిన కార్యక్రమంలో వర్మ విశేషాలను తెలియజేశారు.
'ఫూంక్-2' చిత్రం షూటింగ్ జరుగుతోందనీ, తెలుగు వెర్షన్ టైటిల్ ఇంకా నిర్ణయించలేదనీ వర్మ తెలిపారు. 'ఫూంక్' చిత్రం ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే 'ఫూంక్-2' మొదలవుతుందన్నారు. ఫూంక్ చిత్రానికి తన అసోసియేట్ గా చేసిన మిలింద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారనీ, ఈ సీక్వెల్ కు ఆయనే స్క్రిప్టు రచన చేశారనీ తెలిపారు. హీరో, హీరోయిన్స్ ఎవరనేది ఇంకా నిర్ణయించలేదని త్వరలో తదుపరి అంశాలను మీముందుచుతామంటున్నారు. అలాగే 2010 ఫ్రిబ్రవరిలో సినిమా రిలీజ్ చేస్తామని చెప్పారు.


Click it and Unblock the Notifications











