twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీపై అఫీషియల్ ప్రెస్ నోట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈనెలాఖరుతో ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. డిసెంబరులో పాటలు చిత్రీకరిస్తారు. డిసెంబర్ లో ఫస్ట్ లుక్ విడుదల చేస్తారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, రావ్ రమేష్ నటిస్తున్నారు. అని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాత ఎస్.రాధాకృష్ణ తెలియజేశారు.

    Press Note : Allu Arjun – Trivikram movie release details

    ఈ చిత్ర విశేషాల గురించి నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ... అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్లో సినిమా రూపొందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెర్ ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఫుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తున్నాం. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అందాల భామలు సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈనెలాఖరుతో టాకీ పార్ట్ పూర్తవుతుంది. డిసెంబర్లో పాటలు, ఫైట్లు చిత్రీకరిస్తాం. జనవరిలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తవుతాయి. మరి కొద్దిరోజుల్లో ఆడియో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. ఫిబ్రవరి 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. అని అన్నారు.

    నటీనటులు అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ, బ్రహ్మానందం, సింధు తులాని, వెన్నెల కిషోర్, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత -ఎస్. రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్ శ్రీనివాస్.

    English summary
    Check out Press Note : Allu Arjun – Trivikram movie release details.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X