డ్రగ్ స్కాండల్ అప్పుడు ఒత్తిడి తెచ్చారు...దగ్గుపాటి రాణా
డ్రగ్ స్కాండల్ బయిటపడినప్పుడు రిజైండర్(ఖండన)ఇమ్మని ఓ జర్నలిస్టు నాపై ఒత్తిడి తెచ్చాడు. అప్పుడు డ్రగ్ స్కాండిల్ మీద ఇరుక్కున్న వారంటూ నువ్వు ఇప్పటికి మూడు స్టోరీలు రాసావు..అలాంటప్పుడు ఖండన తయారు చేయటం పెద్ద కష్టమేమీ కాదు అన్నాను అన్నారు రాణా. ఆయన రీసెంట్ గా డ్రగ్ స్కాండిల్ లో మీ పేరు వినిపించినప్పుడు మీ ఇంట్లో వారు ఎలా స్పందించారు అన్నదానికి ఇలా చెప్పుకొచ్చారు. అలాగే నాకు అలా ఖండన ఇచ్చేంత అవసరం లేదని చెప్పాను. ఇక మా ఇంట్లో వాళ్ళు డ్రగ్ స్కాండిల్ లో నాపేరు వినిపించినప్పుడు చాలా కూల్ గా ఉన్నారు. నేను స్వతహాగా అలాంటి వాటికి రియాక్టు కాను అన్నారు. ప్రస్తుతం రాణా..పూరీ కాంబినేషన్ లో రూపొందిన నేనూ నా రాక్షసి చిత్రం సంక్రాంతికి విడుదల అవుతోంది. అలాగే ఆయన తదుపరి చిత్రం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసే అవకాసం ఉంది. అది ఓ రొమాంటిక్ కామిడీ అని తెలుస్తోంది. ఆ చిత్రంలో లీడర్ భామ రిచా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











