స్టూడియో గేట్ వద్ద రాజమౌళిని అడ్డుకొన్న సిబ్బంది.. అక్కడే జక్కన్నకు...

By Rajababu

Recommended Video

Rajamouli Received A Prestigious Award

బాహుబలి రిలీజై ఏడాది పూర్తయినప్పటికీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి క్రేజ్ తగ్గడం లేదు. ఎన్నో అవార్డులు, రివార్డులను ఆయన సొంతం చేసుకొన్నారు. రికార్డు కలెక్షన్లను సాధించారు. తాజాగా జక్కన్నను చెన్నైలో జరిగిన బిహైండ్ఉడ్స్ అవార్డుల కార్యక్రమంలో ఏవీయం గోల్డ్ మెడల్ ఫర్ ది విజనరీ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డును ప్రఖ్యాత దర్శకుడు ఎస్పీ పుత్తురామన్ అందజేశారు. కన్నుల పండువగా జరిగిన అవార్డుల కార్యక్రమానికి అనుష్క, కార్తీ, నయనతార, శింబు, నాజర్, రమ్యకృష్ణ ఇతర సినీ నటులు హాజరయ్యారు.

రాజమౌళికి స్టాండింగ్ ఓవేషన్

రాజమౌళికి స్టాండింగ్ ఓవేషన్

అవార్డుల వేదికపైకి రాజమౌళిని ఆహ్వానించగానే ఆడిటోరియం అంతా హోరెత్తింది. స్టాండింగ్ ఓవేషన్‌తో జక్కనకు విశేష గౌరవాన్ని చాటుకొన్నారు. ఆడిటోరియంలో ఉన్న ప్రతీ ఒక్కరు లేచి చప్పట్లు, ఈలలతో స్వాగతించారు.

వేదికపైకి రమా రాజమౌళి

వేదికపైకి రమా రాజమౌళి

ప్రతిష్ఠాత్మకంగా అవార్డును జక్కన్న అందుకోబోతున్న సందర్భంగా వేదికపై రాజమౌళి సతీమణి రమా రాజమౌళిని కూడా ఆహ్వానించారు. దాంతో చిన్ని వేదికపైకి రా అని రమా రాజమౌళిని జక్కన్న కోరాడు. దాంతో ఆమె వేదికపైకి చేరుకొన్నారు.

ర్యాంప్‌పై నడిచిన జక్కన్న దంపతులు

ర్యాంప్‌పై నడిచిన జక్కన్న దంపతులు

అవార్డు అందుకొన్న తర్వాత వేదికపై ఉన్న ర్యాంప్‌పై రాజమౌళి దంపతులు నడిచారు. ఈ సందర్భంగా అద్బుతమైన స్పందనను ఆడియెన్స్ ఇచ్చారు. దాంతో వారు ఆనందంలో మునిగిపోయారు.

 గేట్ కీపర్ ఆపిన చోటే అవార్డు

గేట్ కీపర్ ఆపిన చోటే అవార్డు

అవార్డు అందుకొన్న తర్వాత రాజమౌళి మాట్లాడుతూ.. నా జీవితంలో తొలిసారి ఏవీఎం స్టూడియోలో అడుగుపెట్టినప్పుడు ఓ సంఘటన జరిగింది. అటూ ఇటూ చూస్తూ ఏవీఎంలో అడుగుపెడుతుండగా గేట్ కీపర్ ఆపాడు. అలాంటి చోటనే ఏవీఎం అధినేత పేరుతో అవార్డును అందుకోవడం గర్వంగా ఉంది అని రాజమౌళి అన్నారు.

నాన్న పేరిట అవార్డును రాజమౌళికి

నాన్న పేరిట అవార్డును రాజమౌళికి

నా తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ఏవీయం గోల్డ్ మెడల్ ఫఱ్ ది విజనరీ ఆఫ్ ఇండియన్‌ను రాజమౌళికి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మా నాన్న మాదిరిగానే రాజమౌళి గొప్ప పర్‌ఫెక్షనిస్టు. అందుకే ఆయనకు ఆ అవార్డును అందజేస్తున్నాం అని ఏవీయం అధినేత ఎస్ శరవణన్ అన్నారు.

బాహుబలి చిత్రంతో చరిత్ర

బాహుబలి చిత్రంతో చరిత్ర

ఈ కార్యక్రమంలో ఎస్పీ పుత్తు రామన్ మాట్లాడుతూ.. సంచలన విజయం సాధించిన బాహుబలి చిత్రంతో భారతీయ సినిమా ప్రతిష్టను రాజమౌళిసార్ ప్రపంచానికి చాటారు. అలాంటి వ్యక్తికి ఏవీఎం అవార్డును ఇవ్వడం సంతోషంగా ఉంది అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X