బుల్లితెర యాంకర్‌కు గట్టి షాక్.. తీర్థంలో అది కలిపి మరీ గర్భం వచ్చేలా చేసిన పూజారి!
ఈ మధ్య కాలంలో ఎవరినీ నమ్మడానికి వీలు లేదు. తెలిసిన వాళ్లే, రోజూ కనిపిస్తున్న వాళ్లే కదా అని అనుకుంటే.. ఇక మన పని అంతే. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు రోజు చాలా మందిని చూస్తుంటారు. ఓ రెండు, మూడు సార్లు చూసిన వెంటనే వారితో మాట్లాడుతూ... క్లోజ్ గా ఉంటే వాళ్లు ఏ రకంగా మోసం చేసేది కూడా తెలియదు. అలా తాజాగా ఓ బుల్లితెర టీవీ యాంకరమ్మ మోసపోయింది. ఆమెకు తెలియకుండానే ఆమె గర్భం దాల్చేలా చేశాడో పూజారి. ఆ పూర్తి వివరాలు ఏంటి, ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చెన్నైలోసి సాలిగ్రామంలో ఉంటూ యాంకర్ గా పని చేస్తోంది ఓ అమ్మాయి. అయితే దైవ భక్తి ఎక్కువ కల్గిన ఈమె ప్రితిరోజూ తన ఇంటికి దగ్గరలో ఉన్న గుడికి వెళ్లేది. అక్కడి గుడిలో పూజలు చేసే పూజారి రోజూ ఈమెను గమనించాడు. అప్పుడప్పుడూ ఈమెతో మాట కూడా కలిపేవాడు. అలా వీరిద్దరి మధ్య కాస్త పరిచయం ఏర్పడింది. రోజూ ఈమె ఎప్పుడు వెళ్లిన ఈమెకు ప్రత్యేక పూజలు చేయించేవాడు. అర్చన వంటివి ప్రతిరోజూ చేస్తుండడంతో ఆమె కూడా అతడితో బాగానే మాట్లాడేది.

అయితే ఓ రోజు యాంకర్.. గుడి మూసేసే సమయానికి గుడికి వెళ్లింది. పూజ అయ్యాక బయటకు రాగా.. పూజారి తాను కూడా ఇంటికి వెళ్తున్నట్లు చెప్పాడు. తన కారులో డ్రాప్ చేస్తాను రమ్మంటూ పిలిచాడు. అప్పటికే తెలిసిన వాడు కావడంతో.. ఆమె కూడా సరేనంది. అలా అతడి కారు ఎక్కిన యాంకర్ కు తీర్థం తాగమని చెప్పాడు. అది నిజమేననుకున్న ఈమె దాన్ని తాగింది. అయితే ఆమెకు తెలియకుండా పూజారి అందులో నిద్ర మాత్రలు కలిపాడు. అలా తన ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
స్పృహ వచ్చి చూసిన ఆమె ఆ విషయం గురించి ఆయన ఒప్పుకున్నారట. పెళ్లి కూడా చేసుకుంటానంటూ మాటిచ్చాడట. అలా అతడికి దగ్గరైన ఆమెకు పూజారి ఓ సారి గర్భ స్రావం కూడా చేయించాడట. తీరా పెళ్లి చేసుకోమని ఆమె అడుగుతుంటే మొహం చాటేస్తున్నాడట. దీంతో చేసేదేం లేక ఆ యాంకర్.. పూజారిపై పోలీసులకు పిర్యాదు చేసింది. తనను పూజారి అత్యాచారం చేసిన విధానం గురించి వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











