ఈ రోజుల్లో హాట్ ‘రొమాన్స్’(ప్రివ్యూ)

By Srikanya

హైదరాబాద్ : ఈరోజుల్లో చిత్రంతో పాపులరైన మారుతి ఓ బ్రాండ్ గా మారారు. ఆయన టీమ్‌ రూపొందిస్తున్న చిత్రం అంటే ప్రేక్షకులలోనూ ఓ విధమైన ఆసక్తి. తాజా ఆయన సమర్పిస్తున్న సినిమా 'రొమాన్స్‌'. 'ఎవ్వెరిబడి నీడ్స్‌' అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది.

ఎస్‌.కె.ఎన్‌ మాట్లాడుతూ-''ఈరోజుల్లో ..తర్వాత మా రెండో సినిమా ఇది. తొలిచిత్రం కొన్ని అనుభవాల్ని ఇచ్చింది. దాంతో ప్రణాళికాయుతంగా ఉన్నాం. అభిరుచితో సాంకేతికతను ఉపయోగిస్తూ..సినిమాలు చేస్తున్నాం. డాళింగ్‌ స్వామి అద్భుత కథతో తెరకెక్కించారు'' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ-'రొమాన్స్‌ ప్రతిఒక్కరికీ అవసరం. అయితే అది ఒక్కరితోనే అయితే బావుంటుందని చెబుతున్నాం'' అన్నారు. దర్శకుని పనిలో వేలు పెట్టకుండా సహకరిస్తున్నా. 2013లో రొమాన్స్‌ గురించే మాట్లాడేలా సినిమా వస్తోంది..అనుకోని పరిస్థితుల్లో ఆగస్ట్ 2నే 'రొమాన్స్' చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అన్నారు మారుతి.

మిగతా ప్రివ్యూ...స్లైడ్ షోలో..

‘ఎవడు' వాయిదా కలిసొచ్చింది...

‘ఎవడు' వాయిదా కలిసొచ్చింది...

నిర్మాతల్లో ఒకరైన ఎస్‌కేఎన్ మాట్లాడుతూ -‘‘ఇందులో ముఖ్య తారలైన ప్రిన్స్, డింపుల్, మానసల పాత్ర చిత్రణలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. వారిమధ్య వర్కవుటయ్యే కెమిస్ట్రీ యువతరాన్ని ఉర్రూతలూగిస్తుంది. ‘ఎవడు' చిత్రం పోస్ట్‌పోన్ కావడం వల్ల దిల్‌రాజుగారి సహకారంతో అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. తొలివారంలోనే మంచి లాభాలు గడిస్తామనే నమ్మకం ఉంది'' అన్నారు.

‘ఈ రోజుల్లో'మించుతుంది

‘ఈ రోజుల్లో'మించుతుంది

తమ ‘ఈ రోజుల్లో' చిత్రాన్ని మించే సినిమా అవుతుందని మారుతి నమ్మకం వ్యక్తం చేశారు. నేను డైరెక్టర్ కాక ముందు నుంచి స్వామి తో మంచి రిలేషన్ ఉంది. ఈ సినిమాతో రైటర్ గా 100% సక్సెస్ అవుతారు, అలాగే డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకుంటారు. ఈ సినిమాలో అందరూ తెలుగమ్మాయిలే నటించారు. చెప్పాలంటే ఈ సినిమాలో అమ్మాయిలే హీరోలని' అన్నాడు

కోరిక కాదు..ఎమోషన్స్ ముఖ్యం

కోరిక కాదు..ఎమోషన్స్ ముఖ్యం

డైరెక్టర్ డార్లింగ్ స్వామి మాట్లాడుతూ ‘ ప్రేమ మొదలైన తర్వాత పెళ్ళికి ముందు ఉండే ప్రేమలో కేవలం కోరికే కాదు ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి వాటినే ఈ సినిమాలో చూపించాను. ఇందులో ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. ప్రస్తుతం యువత ఎలా మాట్లాడుకుంటుందో అలానే ఈ సినిమాలో డైలాగ్స్ ఉంటాయి. సాయి కార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మారుతి, ఎస్.కె.ఎన్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాని నిర్మించినదుకు వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని' అన్నాడు.

బాబా సెహగల్ సాంగ్ హైలెట్

బాబా సెహగల్ సాంగ్ హైలెట్

‘ ఈ రోజుల్లో లాంటి ట్రెండ్ సెట్టర్ తర్వాత సినిమా చెయ్యాలనుకున్నప్పుడు స్వామి గారు కథ చెప్పగానే నచ్చింది. అలాగే మారుతి గారికి కూడా సింగల్ సిట్టింగ్ లోనే కథ నచ్చింది. పెద్ద టెక్నీషియన్స్ తీసిన చిన్న సినిమా ‘రొమాన్స్'. పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ సినిమాలో బాబా సెహగల్ టైటిల్ సాంగ్ ని పాడారని' అన్నారు.

పాటలు హిట్...

పాటలు హిట్...

గుడ్ సినిమా గ్రూప్ నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా ఉంటుంది. మా సంస్థలో 'ఈరోజుల్లో' ఏ స్థాయిలో ఆడిందో 'రొమాన్స్' కూడా అదే రేంజ్‌ను చేరుకుంటుందన్న నమ్మకం ఉంది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది.

టీమ్...

టీమ్...

బ్యానర్: గుడ్ సినిమా గ్రూప్ మారుతీ మీడియా హౌస్
నటీనటులు: ప్రిన్స్, డింపుల్, మానస , ప్రభాక్, నల్లవేణు, సాయి, భారవి, వెంకీ, విష్ణుప్రియ, సాయికృష్ణ, బిందు, అవినాష్, జాహ్నవి తదితరులు
పాటలు: కాసర్ల శ్యామ్, కరుణాకర్,
ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్,
కెమెరా: జె.ప్రభాకర్‌రెడ్డి,
సంగీతం: సాయి కార్తీక్,
కథ-మాటలు- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డార్లింగ్ స్వామి.
నిర్మాతలు: జి.శ్రీనివాసరావు, ఎస్.కె. ఎన్.
సమర్పణ: మారుతి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X