twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దూకుడు లా దూసుకెళుతున్న మహేష్ బ్రాండ్ వ్యాల్యు...!?

    By Sindhu
    |

    దూకుడు సినిమా సూపర్ సక్సెస్ తో మహేష్ బ్రాండ్ వ్యాల్యూ అమాంతంగా పెరిగిపోయిందట. ఇప్పటికే యాడ్స్ లో తిరుగులేని స్థానంలో ఉన్న మహేష్ బ్రాండ్ వ్యాల్యూ అమాంతంగా పెరిగిపోయిందట. ఇప్పటికే యాడ్స్ లో తిరుగులేని స్థానంలో ఉన్న మహేష్ వెంట తాజాగా మరొకొన్ని ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయని సమాచారం.

    ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రిన్స్ మహేష్ బాబు దక్షిణాది షారూక్ ఖాన్ గా అవతరిస్తున్నరంటూ పేర్కొంది. ప్రిన్స్ కు పెరిగిపోతున్నబాక్స్ ఆఫీసు స్టేటస్ వల్లే బ్రాండ్ వ్యాల్యు అమాంతం పైకి పోతుందని తెలిపింది. మహేష్ త్వరలో బ్రాండ్ వేల్యూ లో అల్ టైం హై కి చేరినా సందేహం చెందాల్సిన అవసరం లేదంది.

    ప్రాంతీయ స్థాయిలో శీతల పానీయాలు, స్థానిక నగల వ్యాపార ప్రమోషన్లలో టాలీవుడ్ హీరోలు పాలు పంచుకుంటున్నరు. తాజాగా మహేష్ బాబు ప్రీమియం వాచ్ బ్రాండ్లకే కాదు, ఒక లగ్జరీ ఆటోమొబైల్ ఉత్పత్తికి మొత్తం దక్షిణ ప్రాంతానికే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇవి ఇంకా ఖరారు కాలేదని సమాచారం.

    కాగా, ప్రస్తుతం 4 ప్రధాన జాతీయ బ్రాండ్లు, మహేష్ యొక్క స్టార్ పవర్ పై ఆసక్తిగా ఉన్నాయి. తాజా నివేదికల ప్రకారం ప్రిన్స్ మహేష్ బాబు ను అభిమానించే వారి సంఖ్య పెరిగిపోతున్నట్టు వెల్లడి. 5 ఏళ్ల బాలుడి నుంచి 50 సంవత్సరాల వయస్సు వారి వరకూ, 'ప్రిన్స్" ఫాన్సు గా మారిపోతున్నారంట.

    English summary
    If a leading English daily is to be believed Mahesh will soon be the Shah Rukh of the South as far as brand endorsements are concerned. Mahesh has been bracketed as a star whose popularity is intact despite the highs and lows of his box office status – which in any case has touched an all time high in the past two weeks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X