twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    3 భాషల్లో మహేష్ ‘బిజినెస్ మ్యాన్’ ఆడియో విడుదల ఖరారు...!

    By Sindhu
    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఆర్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న బిజినెస్ మ్యాన్ కోసం బ్యాంకాక్, పటాయ, క్రాబిలలో రెండు పాటల్ని చిత్రీకరించారు. డిసెంబర్ 2 నుంచి 10 వరకు హైదరాబాద్ లో జరిగే ప్యాచ్ వర్క్ తో షూటింగ్ పూర్తవుతుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ పూర్తవుతోంది. డిసెంబర్ నెలాఖరుకు ఫస్ట్ కాపీ రెడీ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

    కాగా డిసెంబర్ 22న బిజినెస్ మ్యాన్ తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ ఆడియోలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 11న తెలుగు చిత్ర చరిత్రలో ఇంతకుముందెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో హయ్యెస్ట్ థియేటర్స్ లో బిజినెస్ మేన్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మహేష్, పూరీ జగన్నాథ్ ఈ చిత్రంలోని థీమ్ సాంగ్ ని పాడటం విశేషం. మహేష్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

    'పోకిరి" లో పూరి డైలాగ్స్ ఎలా పాపులర్ అయ్యాయో అంతకు రెట్టింపు స్థాయిలో 'బిజినెస్ మ్యాన్"లో డైలాగ్స్ పాపులర్ అవుతాయంటున్నారు యూనిట్ సభ్యలు. సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో 'బిజినెస్ మ్యాన్" మరో పెద్ద టర్నింగ్ పాయింట్ కాబోతుంది. సో బిజినెస్ మ్యాన్ తో సూపర్ స్టార్ మహేష్ సృష్టించబోయే సరికొత్త రికార్డ్స్ కోసం జనవరి 11వరకు వేచి చూద్దాం.

    English summary
    Super Star Mahesh Babu’s most awaited movie Business Man has resumed its fresh schedule in Ramoji Film City today. The shooting of the film will be completed with this schedule by December 10. The re-recording and dubbing works of the film are on in Hyderabad. The first copy of the film will be readied by December end.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X