10న సమ్మోహనం ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా మహేష్‌బాబు
న్యూ జనరేషన్ మూవీగా సమ్మోహనం జూన్ 15న విడుదల కానుంది. సుధీర్‌బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఇందులో నాయికగా నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 10గా ఈ చిత్రం తెరకెక్కింది.
సమ్మోహనం చిత్ర విడుదల నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూన్ 10న నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి హైదరాబాద్ ఫిలింనగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలకానున్నది.

సమ్మోహనం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ మహేష్‌బాబు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో చిత్రంలో నటించిన ప్రధాన తారాగణంతోపాటు సాంకేతిక నిపుణులు కూడా పాల్గొంటారని చిత్ర యూనిట్ వెల్లడించింది.
sammohanam movie sudheer babu aditi rao hydari indraganti mohana krishna సమ్మోహనం మూవీ సుధీర్‌బాబు అదితిరావు హైదరీ ఇంద్రగంటి మోహనకృష్ణ


Click it and Unblock the Notifications