కొన్ని గంటల్లో విడుదలకు ముందే 'దూకుడు' 38కోట్ల రికార్డ్ బ్రేక్ బిజినెస్....!
మళ్ళీ తెలుగు తెరని ఒక తెలుగు సినిమా షేక్ చెయ్యడానికి సిద్దంగా ఉంది. అదే నండి మహేష్ 'దూకుడు" సినిమా సెప్టెంబర్ 23 న విడుదల కాబోతోంది. విడుదలకి ముందే ఎన్నో రికార్డ్స్ సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు విడుదల అవుతుండగా, అటు ఫాన్స్ మాత్రమే కాదు అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెన్సార్ నుండి క్లీన్ యు/ఎ పొందిన దూకుడు మరికొన్ని గంటల్లో విడుదలకు సిద్దంగా ఉంది. దూకుడుపై సెన్సార్ కార్యక్రమం తర్వాత మరీ ఎక్కువగా హోప్స్ పెరుగిపోతున్నాయి.
ఈ సినిమా ఆడియో ఇప్పటీ పెద్ద హిట్ కావడం మరియు దసరా కంటే ముందు విడుదల చెయ్యడంతో చాల ఉపయోగాలున్నాయ్ అని అనుకుంటున్నారు. దూకుడు" సినిమా విడుదలకి దగ్గరయ్యే కొద్దీ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇలా అంచనాలు విపరీతంగా పెరిగిపోయిన చిత్రానికి బాక్సాఫీస్ వద్ద తేడా ఫలితాలు ఎదురవడం సర్వసాధారణం. అందుకోసం దూకుడు ప్రిట్స్ డిట్రిబ్యూట్ అయిన తర్వాత దూకుడు టీమ్ ప్రేక్షకుల స్పందన కోసం తిరుపతి విసిట్ చేయనున్నారని సమాచారం..
సెన్సార్ రిపోర్ట్ తర్వాత ఈ సినిమా బాగుందనే టాక్ పరిశ్రమలో స్ప్రెడ్ అవుతోంది. ఎక్కువ థియేటర్స్ లో ఈ సినిమా విడుదలవుతోంది. దాదాపు 38కోట్లుకు ఈ సినిమాని నిర్మాత అమ్మినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేవలం ఓవర్ సీస్ మాత్రమే 3కోట్లుకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ చిత్రం ద్వారా నిర్మాత భారీ లాభాలు పొందే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.


Click it and Unblock the Notifications











