చిరు ప్లేస్ ని భర్తీ చేయడానికి రేస్ లో ఉన్న ఆ నలుగురు!
దాదాపు ప్రిన్స్ మహేష్ బాబు చిత్రం వచ్చి మూడు సంవత్సారాలు కావస్తుడటంతో విసిగిపోయిన ఆయన అభిమానులు ఎక్కడికక్కడా ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో వారికి ఊరటనివ్వడానికి కానివ్వండి చిరు స్థానాన్ని సొంతం చేసుకోవడానికి కానివ్వండి మహేష్ వరుసగా చిత్రాలను చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే అదే వరుసలో రామ్ చరణ్, అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్ కూడా ఉండటం గమనార్హం.
ఆయన హడావుడి చూస్తుంటే ఇకపై సంవత్సరానికి మినిమమ్ రెండు సినిమాలు తన అభిమానులకు అందించనున్నాడని సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న చిత్రం ఆగస్ట్ లో మహేష్ బాబు పుట్టినరోజున వస్తుండగా వెంటనే మరో చిత్రం శ్రీనువైట్లతో రెడీ అవుతోంది. ఇవి రెండే కాక వచ్చే సంవత్సరంలో మరో రెండు చిత్రాలకి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి రాజమౌళి చిత్రం కాగా మరో చిత్రం తమిళ డైరక్టర్ లింగుస్వామి రెండు భాషల్లో రూపొందించే చిత్రం.
ఈ మధ్య గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'ఏ మాయ చేసావె" చిత్రం వలె లింగుస్వామి ఏకకాలంలో ఇటు మహేష్ తో అటు శింబుతో చిత్రాన్ని రూపొందిస్తాడట. ఇలా మహేష్ తన అభిమానుల ఆగ్రహాన్ని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నాడట. ఇవే కాక ఈ మధ్యలో తన అక్క మంజుల మరో చిత్రం చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











