హాట్ టాపిక్..పాపం ప్రిన్స్ మహేష్ కి జ్వరం తగ్గిందో లేదో!?
ఇదే టాపిక్ ప్రిన్స్ అభిమానుల్లో కాక ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. మహేష్ బాబు తాను ప్లూ(జలుబు, జ్వరం)వచ్చిందని ట్విట్టర్ లో పెట్టారు. అవను మరి స్టార్ జలుబు చేసి చీదినా అది వార్తే. ఛానెల్స్ కూడా జ్వరమొచ్చేసింది అంటూ హడావిడీ చేసేసాయి. దాంతో ఆంధ్రా అంతటా ఇదో హాట్ టాపిక్ అయిపోయింది. ఖలేజా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఆయన ఆ చిత్రానికి సంభందించిన పాటల షూటింగ్ లో పాల్గొనాలి. రామోజీ ఫిల్మ్ సిటీలోనూ, అన్నపూర్ణ స్టూడియోలోనూ ఆ సాంగ్స్ షూటింగ్ ప్లాన్ చేసారు. అయితే మహేష్ సిక్ అవటంతో ఆపేసారు. అయితే పెద్దగా జ్వరమేమీ లేదని కేవలం జలుబేనని అంటున్నారు. రెండు మూడు రోజుల్లో రికవరీ అయి షూటింగ్ లో పాల్గొంటాడని యూనిట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఖలేజా ఆడియో ఆగస్టు రెండో వారంలో ప్లాన్ చేసే అవకాశం ఉంది. అలాగే చిత్రాన్ని సెప్టెంబర్ 23న రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శింగనమల రమేష్ నిర్మిస్తున్నాడు. అనుష్క ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











