ప్రిన్స్ మహేష్ బాబు- భారీ అంచనాతో సినిమా
తెలుగు సినిమాల్లో తన పని తాను చేసుకుపోతూ ఎలాంటి ఆర్భాటాలకు హంగామాకూ పాల్పడని హీరో మహేష్ బాబు. నటనని కూడా ఓ కార్పోరేట్ జాబులా చేసుకుపోతాడు. ఆయన నటించిన పోకిరి, అతడు, ఒక్కడు, అనే మూడు సినిమాలు చాలు ప్రిన్స్ లెవల్ ఎంతో చెప్పడానికి. ప్రస్తుతం ఆయన నటించిన పోకిరి హిందీ రీమేక్ లో సల్మాన్ ఖాన్ పాత్రతో పోలిస్తే మహేష్ బాబు చేసిన దాంట్లో ఇరవై శాతం కూడా సల్మాన్ ఖాన్ చేయలేకపోయాడని అంటున్నారు.
పోకిరినీ నేరుగా తెలుగులో రిలీజ్ చేసినా హిందీ వాళ్ళు ఆదరించి ఉండే వారని కూడా చెబుతున్నారు. అలాంటి మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తయారు అవుతున్న సినిమా మీద ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టు నిర్మాత శింగనమల రమేష్ కూడా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను రూపొందిస్తున్నాడని సమాచారం.
మహేష్ బాబు పోకిరి అతడు ఇలియానా భూమిక త్రివిక్రమ్ శింగనమల రమేష్ mahesh babu pokiri athadu ileana bhoomika singanamala ramesh


Click it and Unblock the Notifications