ప్రిన్స్ మహేష్ బాబు ప్రత్యక్షంగా ఈ యేడు (2008) ఒక్క సినిమా చేయలేదు. అయినా రెండు సినిమాల్లో పరోక్షంగా ప్రమేయం పెట్టుకుని హిట్టు సాధించి రికార్డు సృష్టించారని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి. అదెలా అంటే ఆయన వాయిస్ ఓవర్ చెప్పిన జల్సా సినిమా హిట్టని,ఆయన పేరు ఉపయోగించుకుని కథ చేసిన అష్టాచెమ్మా హిట్టు అయిందని చెప్తున్నారు. ఏ హీరోకూ గతంలో ఇలాంటి అరుదైన హిట్టు లేదని అంటున్నారు. ఇది విన్న మహేష్ అభిమానులు సైతం ఆయన ఛరిష్మా ఉండబట్టే రెండు సినిమాలూ ఆయన వాయిస్ ని,పేరుని(ఇమేజ్)ని ఉపయోగించుకున్నాయని గర్వపడుతున్నారు. ఇక వచ్చే త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా వార్తలు సైతం ఈ యేడు..దాదాపు ప్రతీ నెలలోనూ ఊరిస్తూ వచ్చాయి.ఇక ఇలా ఎప్పుడూ మహేష్ ఏదో ఒకరకంగా జనం నోట్లో నలుగుతూండటం ఓ రికార్డేననేది నిజం.
Story first published: Monday, December 29, 2008, 16:46 [IST]