టీవీ షోలో సందడి చేయబోతున్న మహేష్ బాబు?

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి త్వరలో టీవీ షోలో సందడి చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు 'సౌందర్య లహరి' పేరుతో సెలబ్రిటీ టాక్ షో హెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీ పాల్గొన్నారు. త్వరలో మహేష్ బాబు కూడా ఈ షోలో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. మహేష్ బాబుతో రాఘవేంద్రరావుకు మంచి సాన్నహిత్యం ఉంది. మహేష్ తొలి సినిమా 'రాజకుమారుడు' చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

ఈ టాక్ షోలో ఇప్పటి వరకు పాల్గొన్న సెలబ్రిటీలు....తమ జీవితంలో జరిగిన పలు ఆసక్తిక విషయాలు చెప్పుకొచ్చారు. మరి మహేష్ బాబు కూడా తన గురించి ఇప్పటి వరకు అభిమానులకు తెలియని విషయాలేమైనా చెప్పే అవకాశం ఉంది. త్వరలో మహేష్ బాబు పాల్గొనే ఈ షోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

ప్రస్తుతం మహేష్ బాబు 'ఆగడు' చిత్రంలో నటిస్తున్నాడు. ను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆగడు చిత్రం ఆడియో విడుదల తేదీ ఖరారైంది. ఆగస్టు 28న ఆడియో వేడుక గ్రాండ్ గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక ఆడియో వేడుకకు వేదిక కానుంది. ఈ సెలబ్రేషన్స్ లో అభిమానులు కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే ఆగుడు మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశం అభిమానులకు కల్పించిన సంగతి తెలిసిందే. ఎంట్రీలు పంపిన అభిమానులను ఎంపిక చేసి మూవీ ప్రమోషన్స్ లో భాగస్వాములను చేయనున్నారు.

Prince Mahesh Babu in 'Soundarya Lahari' talk show

మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా విడుదలైన 'ఆగడు' చిత్రం సెకండ్ టీజర్ యూట్యూబును దున్నేస్తోంది. ఈ నెల 9న విడుదలై ఈ టీజర్ ఇప్పటికి(3 రోజుల్లో) 7 లక్షల పైచిలుకు హిట్స్ సొంతం చేసుకుంది. టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే 'ఆగడు' చిత్రానికి ఓపెనింగ్స్ బీభత్సంగా ఉంటుందని స్పష్టమవుతోంది.

ఈ టీజర్ చూస్తుంటే 'ఆగడు' చిత్రం పూర్తి వినోదాత్మకంగా సాగే యాక్షన్ ఎంటర్టెనర్ అని స్పష్టం అవుతోంది. ఇక మహేష్ బాబు ప్రతి డైలాగులోనూ పంచ్ లు వేస్తూ అభిమానులను అలరించనున్నారు. 'నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ వేయడానికి నేను రైటర్ ను కాదు ఫైటర్ ను' అంటూ మహేష్ బాబు చెప్పిన పంచ్ డైలాగ్ సెకండ్ టీజర్ కు హైలెట్ అయింది. మొత్తానికి మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఈ టీజర్ చూసి పుల్ హ్యాపీగా ఉన్నారు.

వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆగడు చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా నటిస్తోంది. శృతి హాసన్ ఐటం సాంగు చేయడం మరో ప్రత్యేకత. తమన్ సంగీతం అందించారు. 'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారి అంచనాలున్నాయి.

ఈ చిత్రానికి అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో పాటల చిత్రీకరణ కోసం యూరఫ్ వెళ్లనున్నారు. నార్వే తో పాటు పలు ప్రాంతాల్లో పాటల చిత్రీకరణ జరుగనుంది.స

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X