ప్రిన్స్ మహేష్ బాబు అప్‌కమింగ్ మూవీస్...
మహేష్ బాబు 'అతిధి" చిత్రం తర్వాత నటిస్తున్న తాజా చిత్రం 'ఖలేజా". ఈ చిత్రాన్ని శ్రీ కనకరత్న మూవీస్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సింగనమల రమేష్ బాబు నిర్మిస్తున్నారు. ఇక 'ఖలేజా" తర్వాత మహేష్ బాబు వరుసగా ఐదు చిత్రాల్లో నటించనున్నాడు. అవి ఏమిటంటే....ఆర్.ఆర్.మూవీస్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'మిస్టర్ ఫర్‌ఫెక్ట్", రాజమౌళి దర్శకత్వంలో 'సామ్రాట్", గణేష్ ఇందుకూరి నిర్మాతగా జాస్తిహేమాంబర్ దర్శకత్వంలో 'నందలాల", శ్రీను వైట్ల దర్శకత్వంలో 'దూకుడు" చిత్రంతో పాటు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో కూడా మహేష్ హీరోగా నటించబోతున్నాడు. సో...'అతిథి" తర్వాత తన అభిమానులకు దూరమైన మహేష్ 'ఖలేజా" రిలీజ్ దగ్గర నుంచి తన అభిమానులకు వరుసగా సినిమాలను అలరించబోతున్నాడు కదూ...!
మహేష్ బాబు ఖలేజా అతిధి మిస్టర్ ఫర్ ఫెక్ట్ సామ్రాట్ నందలాల దూకుడు mahesh babu khaleja athidi mr perfect samrat nandalala dukudu


Click it and Unblock the Notifications