మైండ్ లో ఫిక్సయితే బ్లైండ్ గా వెళ్లిపోతా...మహేష్..దూకుడు ఫస్ట్ లుక్

By Sindhu

ప్రిన్స్ మహేష్ బాబు, సమంత జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దూకుడు". ఈ చిత్రాన్ని ఆగస్ట్ మొదటి వారంలో ప్రిన్స్ పుట్టిన రోజును పురస్కరించుకుని విడుదల చేయడానికి ఈ యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రిన్స్ ఫస్ట్ లుక్ ని సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు (మే 31)సందర్భంగా విడుదల చేసారు. ఈ పోస్టర్ చూస్తే మహేష్ 'దూకుడు"లో ఎలా ఉంటాడో తెలుసుకోవచ్చు. ఈ లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తోందని సమాచారం. అంతే కాదు 'మైండ్ లో ఫిక్సయితే బ్లైండ్ గా వెళ్లిపోతా" అంటూ మహేష్ చెప్పిన పంచ్ డైలాగ్ అభిమానులని ఉర్రూతలూగిస్తోంది.

మరోసారి పోకిరి రోజుల్ని తలపుకి తెస్తున్న 'దూకుడు" టీజర్ చూసిన తర్వాత ఈ చిత్రానికి బిజినెస్ క్రేజ్ అమాంతం రెట్టింపయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఆగస్టులో విడుదలకి సిద్దమవుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న దూకుడుని 'నమో వెంకటేశ" నిర్మించిన 14రీల్ ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తోంది.

పోకిరి తర్వాత అయిదేళ్లుగా విజయం లేని మహేష్ బాబు ఈ సినిమాతో ఆ కొరత తీర్చి మళ్లీ విజయాల బాట పడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం భారీ చిత్రాలన్నింటికీ సంగీతం అందిస్తున్న థమన్ ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూరుస్తున్నాడు...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X