విడుదలకు ముందే రికార్డుల మోత...దూకుడు సంచలనం...
దూకుడు సినిమా విడుదలకు ముందే చాలా రికార్డ్స్ సృష్టించేస్తుంది. ఇండియాలోనే కాదు అటు అమెరికాలో కూడా ఈ సినిమా కొత్త రికార్డ్స్ ని సృష్టంచింది. అమెరికాలో 79 థియేటర్లలో విడుదల అవుతుండటం విశేషం. ఒక తెలుగు సినిమా ఇన్ని థియేటర్లలో విడుదల అవడం ఇదే మొదటి సారి. ఇది మహేష్ బాబుకే సాధ్యమయ్యిందని పరిశీలకు అంటున్నారు. వేరే ఏ హీరో సినిమా ఇన్ని థియేటర్స్ లో ఇంతకు ముందెన్నడూ విడుదలవ్వలేదు.
ఇప్పటికే అక్కడ టికెట్స్ అమ్ముడు అయిపోయాయని, ఒక వారం వరకు బుక్ చేసేసుకున్నారని తెలిసింది. అంతే కాదు దీని శాటిలైట్ హక్కులు ౭ కోట్లుకి అమ్ముడు పోవడం కూడా ఒక రికార్డు. సినిమా మీద కూడా భారీ గా అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు తన దూకుడు సినిమా పోకిరిని మించి ఉంటుందని చెప్పడం జరిగింది దీనితో ఇక్కడ భారీగా అంచనాలు పెట్టుకున్నారు ఫాన్స్. సెప్టెంబర్ 23న దూకుడు రిలీజ్ కి సిద్దంగా ఉంది. మరి విడుదలకు ముందే ఈ రికార్డును సొంతం చేసుకున్న ఈ చిత్రం విడుదల తర్వాత మరెన్ని రికార్డులను సొంతం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే...


Click it and Unblock the Notifications











