ఫ్యాన్సీ డేట్ లో మహేష్ ‘బిజినెస్ మ్యాన్’..ఫస్ట్ లుక్..!
మహేష్ బాబు కెరీర్‌లో అతివేగంగా చుట్టివేయబడుతున్న చిత్రం "ది బిజినెస్ మ్యాన్". పూరి జగన్నాథ్ ఫాంలో లేకపొయినా 'పొకిరీ' కాంబినేషన్ కావడం వలన భారీ అంచనాలే నెలకొన్నాయి. 'దూకుడు' సన్సెషన్ హిట్ కాక మునుపే, 'దూకుడు' సినిమాకు భారీ ఓపినింగ్స్ ఎక్సపెట్ చేసారు, అలా చేయడానికి గల కారణం ఆ మూవీ "స్టిల్స్" మరియు పంచ్ డైలాగ్స్‌తో కూడిన "ట్రైలర్స్". "ది బిజినెస్ మ్యాన్" డైలాగ్స్ "పోకిరి" అమ్మా మొగుడిలా వుంటాయని ప్రచారం జరుగుతున్న నేపద్యంలో దూకుడు సినిమానే ఫాలో అయ్యేట్టు వున్నారు.
ప్రిన్స్ మహేష్ బాబు-పూరీ జగన్నాథ్ మరో వెంచర్ 'బిజినెస్ మాన్". ఈ ప్రాజెక్టు పై ప్రస్తుతం సర్వత్ర ఆసక్తి నెలకొంది. అందుకు కారణం, మూవీ టైటిల్ వినూత్నంగా ఉండటం ఒకటైతే, రికార్డు సమయం లో చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేయగలగటం మరొకటి. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఎలావుందనేది మరో 11 రోజుల్లో అంటే, నవంబర్ 11 న వెల్లడికానుంది. న్యూమరాలజి ప్రకారం 11.11.11 తేదీన చేపట్టే పనిలో విజయం తధ్యమని చాలామంది చిత్ర నిర్మాతల నమ్మకం. 'బిజినెస్ మాన్" చిత్రం కూడా అదే రోజు జనవరి 11 వ తేది 2012 న తెరల పై ఆవిష్కరించబడుతుంది. ఈ మూవీ లో మహేష్ బాబు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మ్యూజిక్ తమన్ అందిస్తున్నారు. ముంబై లో మాఫియా నేపథ్యంగా సాగే ఈ చిత్రాన్ని ఆర్ ఆర్ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











